తెలంగాణ భవన్లో వాణిజ్య కార్యకలాపాలు జరుగుతుంటే ఏం చర్యలు తీసుకున్నారని
హై కోర్టు బుధవారంనాడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాజకీయ
పార్టీకి కేటాయించిన భూమిలో ఒక టి.వి. ఛానల్ పెట్టి వాణిజ్య అవసరాలకు
వినియోగించుకుంటున్నారని కాంగ్రెస్ నాయకుడు ఉమేశ్ రావు ఫిర్యాదు చేస్తే ఆ
ఫిర్యాదును ఎందుకు స్వీకరించలేదని కూడా కోర్టు ప్రశ్నించింది.