కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ సాక్షి టీవీని చూడవద్దు, సాక్షి పేపర్‌ను చదవవద్దని ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి రిజ్వాన్ హర్షద్ పి లుపునిచ్చారు.
కాంగ్రెస్ కార్యకర్తలు సాక్షి చానల్‌ను, పేపర్‌ను తమవాటిగా భావిస్తూ అభివృద్ధి చేశారని, అలాంటి ది అదే చానల్ కాంగ్రెస్ పార్టీ అధినేత ను అగౌరవపరుస్తూ తప్పుడు కథనాలను ప్రసారం చేసినందుకు నిరసనగా సాక్షి దినపత్రికలను దహనం చేయడం జరిగిందన్నారు.
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై దొంగ క్లిప్పింగ్‌లను చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి చెంది ఆ పార్టీకే నామాలు పెట్టడం అంటే తి న్నింటి వాసాలు లెక్కించినట్టేనని వి మర్శించారు.