23, నవంబర్ 2010, మంగళవారం

పోల వరం డిజైన్ మార్పు సాధ్యం కాదు

పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుంటే ఐదు జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయని పోల వరం ప్రాజెక్టు సాధన కమిటీ కన్వీనర్ యర్రా నారాయణస్వామి అన్నారు.

30 ఏళ్ళ కిందట అప్పటి ముఖ్యమం త్రి టి.అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, అదే డిజైన్‌తో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో తిరిగి శంకు స్థాపన చేసి వేలాది కోట్ల రూపా యలు ఖర్చుపెట్టారని ఆ ప్లాన్ మేరకు కుడి, ఎడమ కాలువలు తవ్వారని అన్నారు. ఈ పరిస్థితుత్లో డిజైన్ మార్పు సాధ్యం కాదని.. మారిస్తే తాగునీరు, సాగునీరు కు తీవ్ర కొరత ఏర్పడుతుందని యర్రా స్పష్టం చేశారు.