23, నవంబర్ 2010, మంగళవారం

రోశయ్య ప్రభుత్వంలో అవినీతి పాలన

రోశయ్య ప్రభుత్వం అవినీతి పాలనలో కూరుకుపోయిందని, సంక్షేమ పథకాలు అమలుకు నోచుకోవడం లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి విమర్శించారు.

50 ఏళ్లుగా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందన్నారు. అలాంటి పార్టీతో కేసీఆర్ కుమ్ముకై మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కుట్ర పన్నుతున్నాడని విమర్శించారు.

తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో బిల్లు పెట్టేందుకు సోనియాతో ఒత్తిడి చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తుందనే దుష్పప్రచారం మానుకోవాలని ఆయన హెచ్చరించారు.