ఇదివరకు ఎవరికి వారుగా ఉండే మద్యం బడా వ్యాపారులు ప్రస్తుతం ఒక్కటయ్యారు. ప్రాంతాలవారీగా సిండికేట్‌గా ఏర్పడి మరీ దోచుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. మద్యం ప్రియుల అవసరాల్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తూ మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఒక్కో బాటిల్‌పై బ్రాండును బట్టి రూ.20నుంచి 30 దాకా అదనంగా ఒక్కోఫుల్ బాటిల్‌పై 70నుంచి రూ.100వరకు అదనంగా గుంజుతున్నారు. ఇంత జరుగు తున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం నిద్ర మత్తులో జోగుతున్నారు.
ఎవరెంత రేటు కు అమ్ముకున్నా... తమకు రావాల్సిన వాటా వస్తే చాలన్న ఆలోచన ఎ క్సైజ్‌శాఖ అధికారులదని.. ప్రతినెలా కోట్లలోనే అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం. ఒక్కో షాపుపరిధిలో 7నుంచి10 బెల్టు షాపుల వరకు కిరాణా కొట్టు, కూల్‌డ్రింక్ షాపు ఇలా ఒకటేమిటి? వాడ వాడలా బెల్టుషాపులు దర్శనమిస్తాయి.
మద్యం ప్రియులను వ్యాపారులు దోచుకుంటుంటే వ్యాపారులను అధికారులు దోచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. లైసెన్స్‌డ్ షాపులనుంచి ఎక్సైజ్ కాని స్టేబుల్‌స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు నెలవారీ మా మూళ్లు ముడుతున్నట్టు ఆరోపణలున్నాయి.