కేంద్ర మంత్రి పదవిని ఆశించి భంగపడిన గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావుకు కనీసం టీటీడీ చైర్మన్ పదవైనా దకుతుందేమోనని ఆయన అనుచర వర్గం ఆశిస్తున్నది. తొలుత టీటీడీ చైర్మన్ పదవిపై రాయపాటి ఆసక్తి కనపరిచినప్పటికీ ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవిపైనే ఆశలు పెట్టుకున్నారు.
కాంగ్రెస్‌లో రెడ్డి సామాజికవర్గానికి లభించినంత ప్రాధాన్యం మరే సామాజిక వర్గానికి లభించడం లేదని ఆగ్రహం తో ఉన్న రాయపాటికి టీటీడీ చైర్మన్ పదవైనా దక్కుతుందో , లేక కేంద్ర మంత్రి లానే దానిని కూడా ఎవరైనా ఎగరేసుకుపోతారో వేచి చూడాల్సిందే.