చాలాకాలంగా
కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తిగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి
మాజీ ముఖ్యమంత్రి ఎన్.రంగసామి ఎట్టకేలకు
పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన
కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారని పలువురు భావిస్తున్నారు.
పుదుచ్చేరి రీజియన్‌లో రంగసామికి
మంచి పట్టు ఉండడంతో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి.