లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై ఉన్న గరిష్ట పరిమితిని పెంచాలని ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. లోక్‌సభకు పోటీచేసే అభ్యర్ధి ఎన్నికల వ్యయం ప్రస్తుతం రూ.25 లక్షలుండగా, దానిని రూ.40 లక్షలకు, అసెంబ్లీకి పోటే చేసే అభ్యర్థుల వ్యయం రూ.10 లక్షల నుండి రూ.16 లక్షలకు పెంచాలని సిఫారసు చేసినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషీ పేర్కొన్నారు.