13, ఫిబ్రవరి 2011, ఆదివారం

నాగార్జున 'ఢమరుకం' షూటింగ్ ప్రారంభం

నాగార్జున కథానాయకుడిగా శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం 'ఢమరుకం' షూటింగ్ ఫిబ్రవరి 12 సాయంకాలం హైదరాబాదు, అన్నపూర్ణా స్టూడియోలో ప్రారంభమైంది.

దేవుడి పటాలపై చిత్రీకరించిన తొలి షాట్ కు అక్కినేని నాగేశ్వర రావు కెమెరా స్విచాన్ చేయగా, రామానాయుడు క్లాప్ ఇచ్చారు. నిర్మాత అచ్చిరెడ్డి, దర్శకుడు కృష్ణారెడ్డి, సురేష్ రెడ్డి, పత్రికాధిపతి నూకారపు సూర్యప్రకాశరావు సినిమా స్క్రిప్టును దర్శకుడికి అందజే య గా.... పూరీ జగన్నాథ్ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, "ఈ రోజు మంచిదని లాంచనంగా స్టార్ట్ చేసాం. మే నెల నుంచి రెగ్యులర్ షూటింగు జరుగుతుంది. అందుకని విశేషాలన్నీ అప్పుడు చెప్పుకుందాం" అన్నారు, నవ్వుతూ. రెగ్యులర్ షూటింగుకి ఇంకా చాలా సమయం వుంది కాబట్టి, సినిమా వివరాలను తర్వాత వెల్లడిస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు.

ఇందులో అనుష్క హీరోయిన్ గా నటిస్తోంది. చోటా కె. నాయుడు ఫొటోగ్రఫీ నిర్వహిస్తారు.