ఆనాడు ఎన్టీఆర్ హయాంలో ట్యాంక్‌బండ్‌పై మహనీయుల విగ్రహావిష్కరణ సమయంలో తెలంగాణ యోధుడు కొమరం భీమ్‌ను మరిచిన కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గంగాభవాని విరుచుకుపడ్డారు.
విగ్రహావిష్కరణ సమయంలో ఆ నాడు తెలుగు దేశంలో కీలక పదవిలో కేసీఆర్‌కు ఏ ఒక్క తెలంగాణ యోధుడు గుర్తుకురాలే దు... కాని, ఇపుడు తెలంగాణా కోసం కోసం చనిపొయిన కుటుంబాలపై తనకే సానుభూతి ఉన్నట్లు మాట్లాడుతున్నాడని ఎక్కడా లేని ప్రేమ నటిస్తూ యువతను , ప్రాంతీయతత్వాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.