రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంతిని పురస్కరించుకుని త్వరలో కొత్త ఐదు రూపాయల నాణెం విడుదల చేయనున్నట్లు రిజర్వ్‌బ్యాంకు సమాచార కార్యాలయాధికారి తెలిపారు.ఈ నాణెంలో ఒక వైపు అశోక స్థూపంలోని నాలుగు తలల చిహ్నం, కింద ఐదు రూపాయలు అని ముద్రించబడి ఉంటుం ది. మరో వైపు రవీంద్రనాథ్ ఠాగూర్ బొమ్మ ఉంటుంది. దీని కింద రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంతిని గుర్తించే రీతిలో 1861 - 2011 అని ఉంటుంది.