నల్లధనం కేసులో అరెస్టయిన హసన్ అలీకి పాస్‌పోర్ట్ ఇప్పించిన వ్యవహారంలో ఇరుక్కుపోయిన పుదుచ్చేరి గవర్నర్ ఇక్బాల్ సింగ్ తన పదవికి రాజీనామా చేయాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనపై పుదుచ్చేరిలో రోజుకో ఆరోపణ వస్తుండడంతో పాటు బుధవారం బంద్ సైతం జరగడం ఆయన్ను కాస్త ఆవేదనకు గురిచేసినట్టు తెలిసింది. పదవి నుంచి తప్పుకుని తనపై వచ్చిన అభియోగాలను ఎదుర్కొనేందుకు ఇక్బాల్ సింగ్ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.