కడప జిల్లా పులివెందులలో ఆటవిక రాజ్యం కొనసాగుతోందని, అక్కడి ప్రజలు ఇప్పటికీ దోపిడి రాజ్యంలోనే మగ్గుతున్నారని, వీటిని అరికట్టాలంటే వైఎస్ తనయుడు జగన్‌ను ఓడించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి పిలుపునిచ్చారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కుటుంబం, బంధువర్గం ఓ వంద మంది మాత్రమే కోట్లాది రూపాయలు ఆర్జించారే కానీ అక్కడి ప్రజల జీవితాలు మాత్రం దుర్భరమయ్యాయని ఆరోపించారు.
పులివెందులలో వైఎస్ కుటుంబాన్ని ఎదురిస్తే ప్రాణాలతో మిగలరని, అక్కడి జనం భయాందోళనల్లోనే బతకాల్సిన పరిస్థితి ఇప్పటికీ ఉందని ఆయన చెప్పారు.