29, ఏప్రిల్ 2011, శుక్రవారం
రాజకీయాలని శాసించాలని చూస్తున్న జగన్
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని...డి.ఎల్.రవీంద్రారెడ్డిని ఎంపిగా, వైఎస్ వివేకానంద రెడ్డిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గె లుస్తారని రాష్ట్ర మంత్రి బొత్సా సత్యనారాయణ జోస్యం చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్స్ పార్టీ పటిష్టం గా ఉన్న కడప పార్లమెంట్, పులివెందుల శాసనసభ ఎన్నికలు రావాల్సిన అవరమంతా ధన బలంతో విర్రవీగుతూ.. రాజకీయాలని శాసించాలని చూస్తూ.. పదవీకాంక్ష తోనే జగన్ ఎన్నికల ను ముందుకు తీసుకు వచ్చారన్నారు. ధనంతో ఓటర్లను కొనే రోజులు పోయాయని , ఇన్నాళ్ళు తమకు అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకొంతారని... ఆయన ధీమా వ్యక్తం చేశారు. ధనంతో ఓటర్లను కొనే రోజులు పోయాయని అన్నారు.