‘నగరం నిద్రపోతున్న వేళ’ చిత్రం ఆడియో హైదరాబాద్, శిల్పారామంలో జరిగిన కార్యక్రమంలో విడుదలైంది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి మునియప్ప ఆడియో సీడీలను విడుదల చేసి, తొలి సీడీని హీరో జగపతిబాబుకు అందజేశారు. ఈ వేడుకలో కథానాయిక చార్మి, తిప్పేస్వామి, నటుడు బాబూమోహన్, సహ నిర్మాత టేకుల ముక్తిరాజ్, దర్శకులు సాగర్, చంద్రసిద్ధార్థ, కాశీవిశ్వనాథ్, చంద్ర మహేష్, రాంప్రసాద్, గీత రచయితలు సుద్దాల అశోక్‌తేజ, భాస్కరభట్ల, అనంత్‌శ్రీరామ్, ఆదిత్యా మ్యూజిక్ దయానంద్ తదితరులు పాల్గొన్నారు.