చెన్నయ్ ముద్దుగుమ్మ త్రిషకు ఈమధ్య రీమేక్ ల కథానాయికగా పేరు వస్తోంది. ఎందుకంటే, ఇప్పుడు తనెక్కువగా రీమేక్ సినిమాలలోనే నటిస్తోంది. ఈ రోజు రిలీజ్ అవుతున్న 'తీన్ మార్' హిందీలో వచ్చిన 'లవ్ ఆజ్ కల్' సినిమాకు రీమేక్ కాగా, ప్రస్తుతం తను వెంకటేష్ తో చేస్తున్న సినిమా మలయాళంలో వచ్చిన 'బాడీగార్డ్' సినిమాకు రీమేక్. ఇదిలా ఉంచితే, తమిళంలో తాజాగా మరో రీమేక్ సినిమా ఆఫర్ కూడా త్రిషకు వచ్చింది. ఇటీవల హిందీలో వచ్చిన 'బ్యాండ్ బాజా బారత్' హిట్ సినిమాను యూటీవీ మోషన్ పిక్చర్స్ సంస్థ తమిళంలో రీమేక్ చేస్తోంది. ఒరిజినల్ లో అనుష్క శర్మ పోషించిన శృతి కక్కర్ పాత్రను త్రిషకు ఆఫర్ చేశారట. త్రిష కూడా ఇందులో నటించడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది.