వెంకి, ప్రిన్స్ మహేష్ సరసన నటించి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందిన సొట్టబుగ్గల భామ బాలీవుడ్ తార ప్రీతిజింటాను చంఢిఘర్ ఎయిర్పోర్ట్లో అధికారులు అడ్డుకొన్నారు. . కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ భాగస్వామి కూడా ఐన ఈ అమ్మడు ఎవరో తమకు తెలియదనడంతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ గుర్తించక పోగా అడ్డగించి ఐడీ కార్డును చూపించాలనికోరడంతో జింటాకు, ఎక్కడో చిర్రెక్కింది. అంతే.. ఐడీ కార్డును చూపడానికి జింటా మొండికేసి.. నోటికొచ్చిన బూతులతో సీఐఎస్ఎఫ్ అధికారుల తో వాగ్వాదం కి దిగింది. విషయం ముదిరి వివాదస్పదమౌతుందని గ్రహించిన ఉన్నతాధికారులు కలుగచేసికొని పరిస్థితిని చక్కదిద్దుతూ.. సెలబ్రిటిలకు, సాధారణ ప్రజలకు నియమాలు వేర్వేరుగా వుండవని కాస్త జింతాకూ క్లాసు పీకారు. దీంతో ఐడీ కార్డును చూపీ విమానం ఎక్కేయడంతో అక్కడ ప్రీతి బూతు పురాణానికి తెరపడింది.