24, జూన్ 2011, శుక్రవారం
మళ్లీ వస్తున్న ఉదయ్ కిరణ్
హీరోగా ఉదయ్ కిరణ్ అతితక్కువ కాలంలో ఎంతెలా దూసుకువచ్చాడో... తర్వాత కొన్నాళ్లకే అదే స్పీడుతో పడిపోయాడు. కెరీర్ మంచి పీక్ లో వుండగా వ్యక్తిగత జీవితానికి సంబంధించి చేసిన పొరబాటు మొత్తం అతని కెరీర్నే తుడిచిపెట్టేసింది. ఈమధ్య కాలంలో అయితే, అసలు సినిమాలే లేకుండా పోయింది. అసలు తను ఎక్కడున్నాడో... ఏం చేస్తున్నాడో కూడా ఎవరికీ తెలియనంతగా కనుమరుగైపోయాడు. ఈ నేపథ్యంలో తాజాగా మళ్లీ అతనితో ఓ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఉదయ్ హీరోగా నూతన దర్శకుడు 'శ్రీ' దర్శకత్వంలో 'దిల్ కబడ్డీ' పేరుతో ఓ సినిమా రూపొందనుంది. ఈ నెల 27 న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంతోనైనా ఉదయ్ కెరీర్ మళ్లీ ఊపందుకుంటుందేమో చూద్దాం!