పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలవాలని, ఇం దుకోసం వారి ఆహార్యంలోనూ హుందాతనం ఉట్టిపడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా డ్రెస్‌కోడ్ పాటిం చి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాని ఆదేశాలు జారీ అయ్యా యి. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయు లు ఆధునిక దుస్తులకు దూరంగా ఉండాల్సిందే. దీంతోపాటు సెల్‌ఫోన్లు కూడా తరగతి గదుల్లో ఉపయోగించకూడదం టూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు. మరో 18 రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభమవుతాయి. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచీ దీన్ని అ మలుచేసేలా జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యా యి.
ఇకపై జీన్స్‌ప్యాంట్లు, 8,4 జేబుల ప్యాంట్లు, టీ, రౌండ్ నెక్‌షర్ట్‌లు ధరించకూడదు. విద్యార్థులకు పాఠాలు భోదించే సమయంలో ఏకాగ్రత కోల్పోకుండా ఉపాధ్యాయులు సెల్‌ఫోన్ వాడాకాన్ని కూడా నిషేధించారు. విద్యార్థుల జీవితం నాలుగు గోడల మధ్య తీర్చుదిద్దబడుతుందనే కొఠారీ కమిష న్ సూచనల మేరకు ఉపాధ్యాయులు మార్గదర్శకంగా నిలిచేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయంపై పలు ఉపాధ్యాయ సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. దీన్ని సక్రమంగా అమలు చేయాలని ప్ర భుత్వం ఆదేశాలు జారీచేసింది.