19, డిసెంబర్ 2013, గురువారం

ఎవరీ సోనియా?...2

తన తండ్రి ఆరోగ్యం సరిగా లేదని చూసి రావడానికి సోనియా ఇటలీలోని స్వగ్రామానికి వెళ్లారు. ఆమె వచ్చిందని తెలుసుకొని టురిన్ పట్టణంలోని సాంత తెరెసా స్కూలులోని ముఖ్యులు, పాత విద్యార్థులంతా సమావేశమవుతున్నారని, ఆవె కూడా ఓ పది నిమిషాలు వచ్చి వెళితే తామెంతో సంతోషిస్తామని వేడుకొన్నారు. సోనియా పదిహేనేళ్ల వయస్సులో అక్కడ స్కూలులో ఇంగ్లీషు, ఫ్రెంచి నేర్చుకోవడానికి వెళ్లి హాస్టల్‌లో ఉం డేది. ఆమెతోపాటు ఆ గదిలో మరో ఇద్దరు యువతులు ఉండేవారు. సోనియాకు ఉబ్బసం ఉండేది. రాత్రిపూట విడవకుండా దగ్గుతుండేది. ఆమె దగ్గడం వలన తమకు నిద్రపట్టడంలేదని, ఆమెకు ప్రత్యేకగది ఇవ్వాలని ఆ ఇద్దరు యువతులు వార్డెన్‌తో చెప్పారు. ప్రత్యేక గదిలేదంటూ రాత్రిపూట వరండాలో పడుకోవలసిందిగా ఆ వార్డెన్ సోనియాను కోరింది.
సోనియా కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా అందుకు అంగీకరించారు. పగలంతా ఆ ఇద్దరు యువతులతో సోనియా అతి సన్నిహితంగా ఉండేది. ఆరోజున, తమ బాల్య స్నేహితురాలు సోనియా వస్తున్నట్లు తెలుసుకుని ఆ ఇద్దరు యువతులు మహాసంబరపడ్డారు. బడి బయటే నిలబడి సోనియా కోసం ఎదురుచూడసాగారు. అనుకొన్న సమయానికి సోనియా వచ్చారు. "నువ్వు చాలా గొప్పస్థానానికి ఎదిగావని అప్పుడప్పుడు ఇక్కడ పేపర్లో వస్తుంటుంది. ని న్ను చూసి చాలా గర్విస్తున్నాం'' అని ఆ ఇద్దరు యువతులు చెప్పారు. ముందుగా వాళ్లను గుర్తుపట్టనట్లుగా సోనియా అభినయించారు. చివరకు గుర్తుకు వచ్చారని చెప్పి.. వాళ్లను వదిలేసి ముందుకు వెళ్లి అందరినీ పలుకరించసాగారు. ఆ ఇద్దరు యువతులు ఖిన్నులైపోయారు. సోనియాకు కావలసింది అదే!
రాజీవ్‌గాంధీకి డూన్ స్కూలు రోజుల నుంచి అరుణ్‌సింగ్ అత్యంత సన్నిహిత మిత్రుడు. అరుణ్‌సింగ్ కపూర్తలా రాజ వంశానికి చెందిన వ్యక్తి. మహానిజాయితీపరుడు. రాజీవ్‌గాంధీ తన తల్లి ఉన్నప్పుడే, అరుణ్‌సింగ్‌ను ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయించారు. రాజీవ్‌గాంధీ తాను ప్రధాని అయిన తరువాత రేస్‌కోర్సు రోడ్డులోకి మకాం మార్చి.. తన ప్రక్క ఇంటిని అరుణ్‌సింగ్‌కు ఇప్పించారు. అరుణ్‌సింగ్ భార్య నైనా చాలా భోళామనిషి. అందరితో కలుపుగోలుగా మాట్లాడేవారు. సోనియాకు అత్యంత సన్నిహితంగా, అంతరంగికురాలుగా ఉండేవారు. ఇద్దరి ఇళ్ల మధ్య మోకాలి ఎత్తులో చెక్కగేటు మాత్రమే ఉండేది. నైనా ఎప్పుడు పడితే అప్పుడు సోనియా ఇంట్లోకి వెళ్లగలిగేవారు. రాజీవ్ ప్రధాని అయిన తరువాత అతి సంపన్నులను అనుకరిస్తూ, సోనియా విపరీతంగా ఖర్చుపెడుతున్న విషయాన్ని నైనా ఇతర మిత్రులవద్ద ప్రస్తావించారు. ఆ విషయం సోనియా దృష్టికి వచ్చింది. దీనిపై ఆమె నైనాను పిలిచి అలా మాట్లాడవద్దని చెప్పవచ్చు లేదా గట్టిగా మందలించవచ్చు. అందుకు భిన్నంగా... తమ ఇళ్ల మధ్య ఉన్న గేటుకు తా ళం వేయించడమేకాదు, అక్కడ ఒక గార్డును కాపలా పెట్టారు. ఇది గమనించి నైనా ఖిన్నురాలయ్యారు.
(నైనాకే ఇంతటి పరాభవం ఎదురైతే, తామంతా ఇకపై సోనియాతో అత్యంత జాగ్రత్తగా మెలగాలన్న భావనతో సోనియా సన్నిహితురాలందరి ప్రవర్తనలోను మార్పు కొట్టవచ్చినట్లు కనిపించసాగింది. తన గొప్పదనం, ఆధిపత్యం నిర్ధారితమయ్యాయని సోనియా భావించుకోవడానికి ఇటువంటి సంఘటనలు ఆమెకు ఆలంబనంగా అవుతాయి.)
ఢిల్లీలో అత్యంత ప్రముఖ పాత్రికేయురాలు తవ్లీన్‌సింగ్ సోనియాతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. సోనియాకు ఆమె ఎప్పుడైనా ఫోను చేయవచ్చు. ఎప్పుడైనా వాళ్లింటికి వెళ్లవచ్చు. అలాగే, బయట పార్టీలకు వెళ్లినప్పుడు సోనియా తవ్లీన్ ప్రక్కన కొం తసేపు తప్పనిసరిగా కూర్చునే వా రు. తవ్లీన్ ఒక అపార్ట్‌మెంటు ఫ్లాట్ లో ఒంటరిగా ఉండేవారు. రాజీవ్ ప్రధాని కాకముందు సోనియా ఇంకా ఒకరిద్దరు స్నేహితురాళ్లు తవ్లీన్ ఇంటికి వెళ్లి ఒకపూటంతా గడిపేవా రు. సోనియా వాళ్లకు ఇటాలియన్ వంటలు రుచి చూపేవారు. అవి అత్యంత రుచికరంగా ఉండడం తో అందరూ ఆమెను మరీమరీ అభినందించేవారు. ఈ సాన్నిహిత్యం నేపథ్యంలో... సోనియా గాంధీని ఇంటర్వ్యూ చేయాల్సిందిగా తవ్లీన్‌ను ఇండియాటుడే సంపాదకుడు కోరారు. సోనియా ఎవరికీ ఇం టర్వ్యూ ఇవ్వదని తవ్లీన్‌సింగ్ చెప్పారు.
'మీకు తప్పకుండా ఇస్తారు' అని అరుణ్‌పూరీ చెప్పారు. 'ఆమె ఇవ్వదని తెలిసి కూడా నేనెలా అ డుగుతాను? కావాలంటే ఆమె ప్రొఫైల్ రాద్దాం' అని తవ్లీన్ పేర్కొన్నారు. సోనియాను ఆ మాట అడిగినప్పుడు... సందేహిస్తూనే అంగీకరించారు. మరుసటి రోజు ఇండియాటుడే సిబ్బంది తవ్లీన్‌తో కలిసి ప్రధాని నివాసానికి వెళ్లి సోనియాను కలిశారు. "ఇందిరాగాంధీ ప్ర ధానిగా ఉన్నప్పుడు దాదాపు పన్నేండేళ్లు ఆమెకు అతిసన్నిహితంగా వున్నారు. ఇప్పుడు ప్రధాని భార్యగా ఉన్నారు. మీరు ఇందిరాగాంధీలో గమనించిన ఉన్నత లక్షణాలేమిటి?'' అని తవ్లీన్‌తోపాటు వెళ్లిన ఒక విలేకరి చాలా వినయంగా ప్రశ్నించాడు. సోనియాగాంధీ ఏమాత్రం తడుముకోకుండా... 'పొద్దున్నే కార్యాలయానికి వెళ్లేప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ చీర ఎలా కట్టుకొనేదో, తిరిగి సాయంత్రం ఇంటికి వ చ్చేవరకు ఆ చీర అలాగే ఉండేది. ఆమె వారానికి ఒక పూట ఏమీ తినకుండా ఉపవాసం చేసేది. అది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెండు విషయాలు నేను ఆమె నుంచి నేర్చుకొన్నాను'' అని తెలిపారు. ఈ స మాధానం విని అక్కడున్నవారంతా బలవంతాన న వ్వు ఆపుకొన్నారు. ఆ తరువాత తవ్లీన్ ఆమెతో సరదాగా రకరకాల విషయాలు ప్రస్తావించి వాతావరణా న్ని తేలికపరిచింది.
చివరిగా.. ఇటలీకి, ఇండియాకు ఉన్న ప్రధాన తేడా ఏమిటని ఆమె ప్రశ్నించారు. దాని కి సోనియా తడుముకోకుండా ఒక రొట్టె పేరు, మూడు వంటకాల పేర్లు చెప్పారు. 'అవి ఇండియాలో ఎక్కడా దొరకవు. కాని ఇటలీలో ప్రజలు చాలా ఇష్టపడతారు' అని తెలిపారు. మరుసటి వారం సోని యా ప్రొఫైల్ ఇండియాటుడేలో ప్రచురితమైంది. అది విమర్శనాత్మకంగా లేదుగానీ, సోనియా ఆశించినరీతిలో అభినందనాపూర్వకంగా లేదు. అంతే కాదు. అక్కడక్కడా ఆమెపై వచ్చిన ఆరోపణలను కూ డా ప్రచురించారు. తరువాత తవ్లీన్‌సింగ్ సోనియాకు ఫోను చేసి, ఎ టువంటి విమర్శలు లేకుండా ఇలా మృదువుగా రాయించడానికి తా నెంతో శ్రమపడ్డానని చెప్పబోయినా.. సోనియా వినిపించుకోలేదు. మరుసటిరోజు నుంచి తవ్లీన్‌తో సంబంధాలన్నీ బంద్ అయ్యాయి. తవ్లీన్ ఫోను చేస్తే సోనియాకు ఇవ్వగూడదన్న ఆదేశాలు వెలువడ్డాయి.
ఇందిర ప్రధానిగా ఉన్న సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులెవరూ లేనప్పుడు సోనియా ప్రధాని వ్యక్తిగత సిబ్బంది ఉండే ఆఫీసులో కూర్చునేవారు. ఒకరోజు... ఓరియంటల్ ఫైర్ ఇన్సూరెన్స్ కు చెందిన ఒక వ్యక్తి వచ్చి అక్కడి సిబ్బందికి ఇన్సూరెన్సు పా లసీ అందించేందుకు వచ్చారు. తరువాత సోనియా పట్ల అతి వి నమ్రత కనబరుస్తూ... ఆమె అడిగిన వివరాలన్నీ చెప్పారు. ప్రతీ ఫ్యాక్టరీ, ప్రతి కార్యాలయానికి బీమా తప్పదని... ఏజెంటుకు ఇన్సూరెన్స్ కంపెనీ 15 శాతం కమీషన్ చెల్లిస్తుందని వివరించాడు. ఎంతో మంది ఎంపీలు కూడా ఇలా బీమా పాలసీలు చేయిస్తుంటారని తెలిపారు. 'మీరు కూడా బీమా కంపెనీలో ఏజెంటుగా చేరితే... నెలకు ఎవ్వరికీ తెలియకుండా నాలుగైదు వేలు వస్తాయి' అని చెప్పా డు. సోనియా సందేహిస్తూనే అందుకు అంగీకరించారు. ఆమె ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంటుగా ప్రధా ని నివాసాన్ని చిరునామాగా ఇవ్వడం తరువాత చాలా వివాదాస్పదమైంది. పార్లమెంటులో దీనిపై ప్రశ్న కూడా రావడంతో ఇందిర ఖిన్నురాలయ్యారు. సోనియా కంగారుపడి వెంటనే తన ఏజెన్సీని రద్దు చేసుకున్నారు.
- See more at: http://www.andhrajyothy.com/node/35227#sthash.5kLtS0bB.dpuf