ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నందుకు హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మంగళవారం రాత్రి తన అనుచరులతో కలిసి కరీంనగర్‌లోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి కోర్టు చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈటల రాజేందర్, ఆయన అనుచరులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.