రాష్ట్రంలో జరుగుతున్న రైతు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలని బీజేపీ నేత, కేంద్ర మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సుభాష్ మహల్యా అన్నారు. రాష్ట్రంలో రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తుండడం వల్లే రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నార ని, నవంబరు, డిసెంబరు నెలల్లో 300మంది దాకా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, రైతు, నేతన్నలు చనిపోతే ఎఫ్ఐఆర్‌లో క్రిమిసంహారకమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు నమోదు చేయడం అన్యాయమన్నారు. వాస్తవ పరిస్థితులను చేర్చకపోవడం దారుణమన్నారు.
దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. విదర్భ తరహాలో పంటల బీమా పథకాన్ని రైతులకు ప్రయోజనం కలిగించేలా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాష్ట్ర రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు