తనపైనే పలు ఆరోపణలు రావటం దానిపై గవర్నర్ విచారణకి నిర్ణయాలు తీసుకోవటం మిగుడు పడని కర్నాటక సిఎం యడ్యూరప్ప అవినీతి, అక్రమాలపై కొత్త బంపర్ ఆఫర్ ప్రకటించారు.
రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు బినామీ పేర్లతో సంపాదించిన ఆస్తుల వివరాలను గుర్తించి ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారాన్ని అందచేసిన వారికి తగిన నగదు బహుమతి ఇస్తామని ప్రకటించా రు. బెంగుళూరులో పలువురు రాజకీయ నాయకులు వేలకొద్దీ ఎకరాలను బినామీ పేర్లతో ఆస్తులను సొంతం చేసుకున్నారని . ఈ ఆస్తుల గురించి ప్రభుత్వానికి తగిన సమాచారం ఇస్తే వారి పేర్లను రహస్యంగా ఉంచి నగదు బహుమతులు ఇస్తామని యడ్యూరప్ప పేర్కొన్నారు.