తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాలలో ప్రవేశపెట్టాలని లేనట్లయితే కార్మిక ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఏజీటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో తమ పార్టీ తెలంగాణ తీర్మానం చేసిందని తెలిపారు. అన్ని యూనియన్లు ఐక్యం గా పోరాడితే అది కార్మిక జెఏసీ అని కాని కొన్ని సంఘాలు మాత్రమె జెఏసీ పేరిట తె లంగాణ పోరాటాలు చేయటం ఎంతవరకు సబబని , కార్మిక గుర్తింపు ఎన్నికల్లో లబ్ధిపొందే ప్రయత్నాలు చేస్తూ రాజకీయ ప్రయోజనాలు ఆశించే ఇలా చేస్తున్నాయని విమర్శించారు
సీతా రామయ్య .