62 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం వివిధ దళాలకు చెందిన బృందాలు కవాతు నిర్వహించాయి. సాయుధ దళాల గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, శాసన మండలి చైర్మన్ చక్రపాణి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.