రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కి సొంత జిల్లాలోనే ముసలం ప్రారంభమైంది. యువనేత జగన్మోహన రెడ్డి జనదీక్షకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను దమ్ముంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు అయన ప్రత్యర్ధి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .
పార్టీని విమర్శించిన ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారని .. ఇప్పుడు తాను ముఖ్యమంత్రినే విమర్శిస్తున్నానని, మరి తనని రాజీనామా చేయమంటే చేయడానికి ... సస్పెండ్ చేసినా ఎమ్మెల్యేలను తప్పుకోవాలనడం ముఖ్యమంత్రి చేతగానితనానికి నిదర్శనం శాసనసభ్యులు రాజీనామా చేయాలని చెప్పే సి ఎం కూడా రాజీనామా చేస్తారా? రాజీనామా చేస్తే ఆయనపై పీలేరు లో తానే పోటీ చేస్తానని సవాల్ విసిరారు.