12, ఫిబ్రవరి 2011, శనివారం

దమ్ముంటె తెలంగాణా ఇవ్వని 'కేంద్రం'పై అవిశ్వాసం పెట్టు

13 మంది సభ్యులతో అవిశ్వాసం పెడతానని విర్రవీగుతున్న కెసిఆర్ కి తెలంగాణపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. తెలంగాణాకి మద్దతుగా నిలుస్తానని చెప్పిన ఎన్డియే మద్దతుతో కేంద్ర సర్కార్ పై అవిశ్వాసం పెట్టాలని టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సవాల్ విసిరారు

శనివారం ఆయన నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ... తెలంగాణా పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోవటమే కేసేఅర్ కి తెలిసిన విద్యా... కేంద్ర ప్రభుత్వాన్ని ఏనాడు నిలదీయకుండా. ప్రజల్లో అభద్రతా సృష్టించి... ఇక్కడే కాలం వెల్లదీస్తున్నాడని.. తానీ తెలంగాణా బిల్లు పార్లమెంట్లో పెట్టె యత్నం ఎందుకు చేయడని ప్రశ్నించారు.

కేసీఆర్‌కు దమ్ముంటే టూజీ స్పెక్టం, కామన్ హెల్త్, ఆదర్శ్ కుంభకోణాలకు పాల్పడ్డ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలన్నారు. తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టాలనే రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని కేసీఆర్ ప్రకటించడం హాస్యాస్పందగా ఉందని కేసీఆర్ చెబితే రాజకీయ పాఠాలు నేర్చుకునే స్థితిలో టీడీపీ లేదన్నారు సోమిరెడ్డి .