మాజీ ఎంపీ జగన్ అనుచరులు మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందుతుడి భానుకిరణ్‌తో సంబంధాలు పెట్టుకొని కడప జిల్లాను భ్రష్టు పట్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు.మంగళవారం కడప జిల్లాలో రెండో రోజు రైతు కోసంయాత్ర లో ఆయన మాట్లాడారు.
చిరంజీవి తన సొంత సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీలో తన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారని అన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం తీసుకు వస్తానని పార్టీని పెట్టిన చిరంజీవి సామాజిక న్యాయం సాధించాడని, ఇక తన సామాజిక న్యాయం కోసమే అవినీతి కాంగ్రెస్ వైపు వెళ్లారన్నారు. చిరంజీవి సినిమా అయిపోయిందని చెప్పారు. దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి అవినీతి అక్రమాలతో కోట్లాది రూపాయలు సంపాదించారన్నారు. టిడిపి అందరి అవినీతి, అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. ప్రజలు అమాయకులు కారని, అందరినీ వారు గమనిస్తున్నారన్నారు.