సిఎంకు కొత్త బుల్లెట్‌ప్రూఫింగ్ కాన్వాయ్
ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి పోలీసు శాఖ కొత్త కాన్వాయ్‌ని ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్కార్పియో సంస్థ తయారు చేసిన మూడు బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలను, జామర్‌తోపాటు మరో ఐదు వాహనాలను వాడుతుండగా వీటిని తొలగించి వాటి స్థానంలో అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన ఫోర్డ్ సంస్థ కొత్తగా తయారు చేసిన 'ఎండీవర్' వాహన శ్రేణిని సమకూర్చేందుకు ప్రభుత్వం అవసరమైనన్ని నిధులు కేటాయించడంతోపాటు వాహనాలకు ముంబయి నగరంలో వాహనాలను సిద్ధం చేసేందుకు ఫోర్డ్ సంస్థ సమాయత్తమవుతోంది.