అనంత స్వర్ణమయం పథకం కొనసాగించాలని కోరుతూ టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు సహకారంతో సుప్రీంకోర్టును పిటిషన్ వేసినట్లు సమాచారం. ఏపీ భవన్‌లో ఆదికేశవులు విలేకరులతో మాట్లాడుతూ సాధికారమండలిపై ధ్వజమెత్తారు. అనంత స్వర్ణమయానికి బంగారం ఇచ్చిన దాతలకు దాన్ని తిరిగి ఇచ్చేయాలనడాన్ని తప్పుపట్టారు.
పురావస్తుశాఖకు దేవాలయాన్ని అప్పగించాలన్న మండలి నిర్ణయం తొందరపాటు చర్యగా అభివర్ణించారు. రేషన్‌దర్శన ప్రతిపాదనను ఖండించారు. 20, 30 గంటలు ప్రయాణం చేసి వచ్చి కొన్ని నిమిషాలపాటు స్వామిని దర్శించి తరించిపోయే భక్తులను విమాన వేంకటేశ్వరుని దర్శించి వెళ్లాలనడం సరికాదన్నారు. మరోసారి అవకాశం ఇస్తే చైర్మన్ పదవి చేపట్టేందుకు సిద్ధమేనన్నారు.