తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని బజారుకీడుస్తానని గతంలో బీరాలు పలికిన టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ ఇప్పుడు ఆమెను పల్లెత్తు మాట అనకపోవడానికి కారణం ఏమిటని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు ప్రశ్నించారు. కాంగ్రెస్. పార్టీతో కెసిఆర్ కుమ్ముక్కు అవుతు...కేశవరావు ఇంటికి వెళ్ళి కాంగ్రెస్.ని బలోపేతం చేస్తానని బహిరంగంగా ప్రకటించారు. ఈ రోజు వరకూ సోనియా గాంధీ గురించి ఒక్క మాట మాట్లాడటం లేదు. కారణం ఏమిటి? మీ ఇద్దరి మధ్య రహస్యం ఏమిటి? తెలంగాణకు జరిగిన అన్యాయానికి కాంగ్రెస్...కెసిఆర్ కారణం..కెసిఆర్ రాజకీయ స్వార్ధం వల్ల తెలంగాణ ఉద్యమం నీరుగారుతోందని ఆయన ఆరోపించారు.ఆయన రాజీనామా చేయడుగాని మిగిలినవారికి నీతి సూత్రాలు చెబుతారు.
ముందు ఆయనను రాజీనామా చేసి పార్టీ పక్కనబెట్టి స్వతంత్రునిగా పోటీచేయమనండి. మేం కూడా ఆలోచన చేస్తాం. ఆయనకు తన పార్టీ కావాలిగాని మిగిలినవారికి వద్దా' అని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.
ముందు ఆయనను రాజీనామా చేసి పార్టీ పక్కనబెట్టి స్వతంత్రునిగా పోటీచేయమనండి. మేం కూడా ఆలోచన చేస్తాం. ఆయనకు తన పార్టీ కావాలిగాని మిగిలినవారికి వద్దా' అని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.