తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్ నిర్వహించ తలపెట్టనున్న చండీయాగం కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 14 నుంచి చండీయాగం మూడు రోజుల పాటు కొనసాగుతుంది. మహబూబ్ నగర్ మాజీ ఎంపీ ఎపి జితేందర్ రెడ్డికి చెందిన వ్యవసాయ క్షేత్రం చండీయాగానికి అనుకూలంగా ఉందా లేదా అని గత మూడు రోజుల నుంచి వేద పండితులతో వచ్చి యాగం నిర్వహించే స్థలాన్ని పరిశీలించారు. మొదటి రోజు కెసిఆర్ దంపతులు పాల్గొంటారని సమాచారం.