12, ఏప్రిల్ 2011, మంగళవారం

ధూళిపాళ వర్ధంతి ఏప్రిల్‌ 13.

మహామంత్రి తిమ్మరుసు, శ్రీకృష్ణార్జున యుద్ధం, నర్తనశాల, బొబ్బిలి యుద్ధం, శ్రీకృష్ణావతారం, కంచుకోట, ఉండమ్మా బొట్టుపెడతా, బాంధవ్యాలు, బాలరాజుకథ, అందాల రాముడు, మహాకవి క్షేత్రయ్య, బాలభారతం, ఆత్మీయులు, శ్రీకృష్ణపాండవీయం, దాన వీర శూర కర్ణ, సీతాకళ్యాణం' తదితర చిత్రాల్లో అసమాన నటన ప్రదర్శించి ఎన్టీఆర్‌ అభిమానం పొందిన ధూళిపాళ
విలన్‌గా, కేరక్టర్‌ ఆర్టిస్ట్‌ గా ఆ పాత్రల్లో రాణించడానికి ఉచ్ఛారణలోని ప్రత్యేకత, స్పష్టమైన ఉచ్చారణ, పాత్రోచిత నటన ప్రధాన కారణాలయ్యాయి. వీర, రౌద్ర, రసాల పాత్రలలో ఎలా ఒదిగి పోయినారో సాత్విక పాత్రల్లోనూ అదే విధంగా ఒదిగిపోయి ఆ పాత్ర కళ్ళముందు కనిపించేలా నటించేసే ధూళిపాళ 300 చిత్రాలకు పైగా నటించారు.
చివరి దశలో సన్యాసం స్వీకరించి కామేశ్వరానంద స్వామిగా మారి 2007లో తనువు చాలించారు. ధూళిపాళ వర్ధంతి ఏప్రిల్‌ 13.