గత 16 రోజులు గా సత్యసాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సత్యసాయి బాబా ఆరోగ్యంపై మంగళవారం ఉదయం తాజా బులెటిన్ విడుదల డాక్టర్ సఫాయా చేసారు. బాబా ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన శరీరం చికిత్సకు స్పందిస్తుందని హృదయ స్పందన, బీపీ నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. కాగా మూత్రపిండాలకు డయాలసిస్ కొనసాగుతోందని త్వరలోనే... ఈ వ్యవస్థ కూడా మెరుగుపడుతుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు
మరో వైపు శ్రీరామనవమి వేడుకలతో కోలాహలంగా ఉండే పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం నేడు బోసిపోయి కనిపించింది. ప్రతి ఏటా శ్రీరామ నవమినాడు భక్తులను ఉద్దేశించి బాబా చేసే ప్రసంగం నేడు వినిపించక పోవటంతో ఇక్కడి సత్తెమ్మ దేవాలయంలో గ్రామస్తులతో కలసి తరలి వస్తున్న భక్తులు బాబా ఆరోగ్యం మెరుగుపడాలని పూజలు నిర్వహిస్తున్నారు