కడప లోకసభ స్థానంలో ఇటలీ అహంకారానికి, కడప పౌరుషానికి మధ్య జరుగుతున్న పోరులో వైయస్ జగన్ విజయం సాధిస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు దీమా వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ..కడపలో కాంగ్రెసు పార్టీకి ఓటమి తప్పదని, ప్రభుత్వం ఆభాసు పాలవుతుందని అన్నారు. తెలంగాణా అంశంపై తమ అధినేతకు స్పష్టమైన విధి విధానం ఉందని గెలిచిన తర్వాత పార్లమెంటు సభ్యుడి హోదాలో తెలంగాణపై తమ పార్టీ నాయకుడు వైయస్ జగన్ స్పష్టమైన ప్రకటన చేస్తారని చెప్పారు.