తన రాజీనామా విషయంలో వెనక్కి తగ్గనని చెప్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ విజయవాడ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీ హైడ్రామా నడుమ రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. గత పక్షం రోజులుగా కృష్ణ తెలుగుదేశంలో రేగిన చిచ్చు చివరికి నారా, నందమూరి కుటుంబాల మద్య భగ్గుమనేల చేసింది. ఈ నేపద్యంలో రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు వల్లభనేని వంశీ ప్రకటించడం కొంత ఊరట కలిగించే అంశమే.