రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'దొంగలముఠా' చిత్రంలో రవితేజ, ఛార్మి, లక్ష్మి మంచు, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, సుబ్బరాజ్, సుప్రీత్ ముఖ్యపాత్రధారులు. శ్రేయ ప్రొడక్షన్స్ పతాకాన రూపొందిన ఈ చిత్రానికి సహ నిర్మాత సుమన్ వర్మ, నిర్మాత కిరణ్ కుమార్ కోనేరు.
అయిదుగురు సభ్యులతో కూడిన ఇసి 'దొంగలముఠా'ని చూసి 16-3-2011న 2 కట్స్‌తో 10 అడుగుల నిడివి ఫిలిం కత్తిరించి 'యు' సర్టిఫికెట్ జారీ చేసింది.
1. మూడు నాలుగు రీళ్ళలోని 'గెస్ట్ లు ఏదో చేసుకుంటూ వుండొచ్చుకదా' అనే డైలాగ్‌ని శబ్దంతో సహా తొలగించారు.
2. ఏడవ రీలులో చార్మీ రాక్స్‌మీద పాకే దృశ్యాన్ని తొలగించడం ద్వారా 10 అడుగుల నిడివిగల ఫిలిం కత్తిరింపుకు గురి అయింది.
12 రీళ్ళ నిడివిగల ఈ చిత్రం 18.3.11న విడుదల అయింది.