13, ఏప్రిల్ 2011, బుధవారం

డల్లాస్‌ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైన 'ఎల్బీడబ్ల్యూ'

చిన్న సినిమాగా విడుదలై మంచి చిత్రంగా గుర్తింపు తెచ్చుకున్న 'ఎల్బీడబ్ల్యూ'. ఈ చిత్రం ఇప్పుడు డల్లాస్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది.

భారతదేశం నుండి కేవలం మూడు చిత్రాలు మాత్రమే ఫెస్టివల్‌కు ఎంపికయ్యాయి. 'దోబీఘాట్‌, రోబో'తో పాటుగా 'ఎల్బీడబ్ల్యూ' చిత్రం ఎంపికైందని నిర్మాతల్లో ఒకరైన కిరణ్‌ భూనేటి ఆనందం వెలిబుచ్చారు.

ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో ఎ వర్కింగ్‌ డ్రీమ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రం యాభై రోజుల వేడుక మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. మంచి సినిమా తీస్తే ప్రేక్షకాదరణ ఉంటుందనడానికి ఈ చిత్రమే నిదర్శనం అని హీరోలు సిద్ధు, అభిజిత్‌, హీరోయిన్లు నిశాంతి, చిన్మయి తెలిపారు.