13, ఏప్రిల్ 2011, బుధవారం

'రాజ్‌أ సెన్సార్ కట్స్

వి.ఎన్‌.ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన 'రాజ్‌' చిత్రంలో సుమంత్‌, ప్రియమణి విమలారామన్‌, అజయ్‌, అలి, గిరిబాబు ముఖ్య పాత్రధారులు. కుమార్‌ బ్రదర్స్‌ పతాకాన కుమార్‌ బ్రదర్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం జగన్‌.

అయిదుగురు సభ్యులతో కూడిన ఇసి 'రాజ్‌'ని చూసి 11 కట్స్‌లో 89.08 అడుగుల నిడివిగల ఫిలిం కత్తెరించి 'యుఎ' సర్టిఫికెట్‌ జారీ చేసింది.

1. ఒకటి రెండు రీళ్ళలో చిత్రీకరించిన

ఎ) 'ఎవతైనా వలలో వేసుకుందా' డైలాగ్‌ని సౌండ్‌తో సహా కత్తిరించారు.

బి) స్విమ్మింగ్‌ ఫూల్‌ నుంచి నైట్‌ షర్ట్‌ తో బయటకు వచ్చే ప్రియమణికి సంబంధించిన క్లోజ్‌ అప్‌ దృశ్యాలను తొలగించడం ద్వారా 5.04 అడుగుల నిడివిగల ఫిలిం కత్తిరింపుకు గురి అయింది.

2. ఒకటి రెండు రీళ్లలోనే బీచ్‌లో ఎర్రటి దుస్తులతో ఉన్న వారి క్లీవేజ్‌ దృశ్యాలను తొలగించడం ద్వారా 5.04 అడుగుల నిడివిగల ఫిలిం కత్తెర పాలయింది.

3. ఒకటి రెండు రీళ్ళలో చిత్రీకరించిన 'అది జరగలేదా' డైలాగ్‌ని శబ్దంతో సహా తొలగించారు.

4. మూడు నాలుగు రీళ్ళలో

ఎ) 'ఖాళీగా వున్నాం వచ్చి హెల్ప్‌ చేయమంటావా'

బి) 'ఎంత తొందరగా పెళ్ళాంని ప్రెగ్నెంట్‌ చేస్తే అంత తొందరగా మనం పార్టీ చేసుకోవచ్చు' అనే డైలాగ్స్‌ శబ్దంతో సహా తొలగింపుకు గురి అయ్యాయి.

5. మూడు నాలుగు రీళ్ళలో చిత్రీకరించిన పాటలో హీరోయిన్‌ రెడ్‌ టవల్‌తో డ్యాన్స్‌ చేసే దృశ్యాలను తొలగించడం వల్ల 79.00 అడుగుల నిడివి గల ఫిలిం కత్తెర పాలయింది.

6. అయిదు ఆరు రీళ్ళలో గల 'డాన్‌ పెరియన్‌ చాంపేన్‌' అనే డైలాగ్‌ని శబ్దంతో సహా తొలగించారు.

7. తొమ్మిది పది రీళ్ళలో

ఎ) 'నాది కనిపించ లేదు' అనే డైలాగ్‌లో 'నాది' అనే పదం వినబడకుండా

బి) గోకుతున్నావా అనే పదం వినరాకుండా

సి) 'పోసుకువచ్చా' అనేది వినబడకుండా తొలగించారు.

14 రీళ్ళ నిడివిగల 'రాజ్‌' చిత్రం 18.3.11న విడుదలయింది.