ఐక్య ఉద్యమాలతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని టీఆర్‌ఎస్ మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని, వీటిని తిప్పి కొట్టేందుకు పార్టీలకతీతంగా నాయకులు, కార్యకర్తలు, మహిళ లు ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 14 నుంచి 25 వరకు టీ ఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాలను తెలంగాణా అంతటా జరపాలని ఆమె కేడర్ కి సూచించారు