24, నవంబర్ 2011, గురువారం

బౌలింగ్‌తో “గోల్‌”

అనంతపురం జిల్లాకు చెందిన సల్మాభాను అందరి కన్నా భిన్నంగా...
తానిష్టపడిన క్రికట్‌పైనే మక్కువ ప్రదర్శిస్తూ...
తనకంటూ క్రీడా ప్రపంచంలో ప్రత్యేక స్ధానం దక్కించుకోవాలని...
చిన్నతనం నుండే కలలు కంటూ... ఒడిదుడుకులెదురైనా...
పట్టు వదలని దీక్షతో నిరంతరం క్రికెట్‌పైనే దృష్టి కేంద్రీకరించి...
తన సత్తా నిరూపించుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
చదువుకునే పిల్లలు ఆడుతున్నా... టివి వేసి క్రికెట్‌ చూస్తూ... దానికే అంకితమైపోయినట్లు కనిపిస్తే... మన ఇళ్లలో గయిమనే వాళుల చాలా మంది ఉన్నారు. ఆసకిత కర అంశాలపై తదేక దృష్టి కేంద్రీకరించిపనిచేసే వారిని ఆ క్రమంలోనే ప్రోత్సహిస్తే.. ఆ రంగం లో ప్రతిభా పాటవాలు సాధించి ముందుకేగ గలరని తెలిసినా ప్రతి ఒక్కరూ తన బిడ్డల్ని డాక్టరుగానో... ఇంజనీర్లుగానో చూడాలన్న తపనే వారిని ఇతర రంగాల వైపు మళ్లకుండా చేసోందన్నది వాస్తవం.
అనంతపురం పట్టణానికి సరిహద్దులోని గుత్తి రోడ్డులో నివాస ముంటున్న సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన సల్మా భాను , అందరి ఆడపిల్లల్లానే తన తల్లిదండ్రులు సయ్యద్‌ అప్సర్‌, మహా ముదాల పెంపకంలో సాంప్రదాయ బద్దంగానే పెరిగిన ఆడపిల్ల.
అయితే క్రీడా ప్రపంచంలో అంతా మక్కువ ఎక్కువ చూపే క్రికెట్‌పై ఆసక్తి ప్రదర్శిస్తూ..చిన్న తనం లోనే క్రికెట్‌ ఆడటం ప్రారంభిం చింది. సల్మా భాను మగాళ్లు ఆడాల్సిన ఆటలాడుతోందని అంతా చెవులు కొరుక్కునా... ఆమె తల్లిదండ్రులు ఏనాడూ ఆమెని నిరుత్సాహ పరచలేదు. సరికదా... ఆమెకి మరింత ప్రోత్సాహం అందించడంతో ఉత్సాహం ఉరకలేస్తూ... అను నిత్యం తనని తాను క్రికెట్‌ రంగంలో నిరూపించుకునే ప్రయత్నాలు ఆరంభించింది.
ఈ క్రమంలోనే సల్మా ఉత్సాహాన్ని చూసిన జిల్లా క్రికెట్‌ అసోషియేషన్‌ మాజీ కార్యదర్శ సాగర్‌ చౌదరి ఆమెకు క్రికెట్‌లోని ఎన్నో మెలుకువలు నేర్పించడమే కాకుండా అటు బౌలింగ్‌, ఇటు బ్యాటింగ్‌లోనూ ప్రావీణ్యత సంపాదించేలా శిక్షణ ఇస్తూ... ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా నిలచారు. అడపా దడపా గ్రామీణ ప్రాంతాలతో పాటు, వివిధ జట్ల మధ్య జరిగే పోటీలలోనూ పాల్గొంటూ... సామర్ధ్యం ఉన్న మహిళా క్రికెటర్‌గా అందరి ప్రశంస లు అందుకుంటు 2003లో క్రికెట్‌ క్రీడా ప్రపంచంలోకి అడుగు పెట్టింది ఆమె..ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌తో తన సత్తా చూపి అనతి కాలంలోనే అనంతపురం జిల్లా జట్టులో స్ధానం దక్కించు కుని తన సత్తా నిరూపిం చుకుంది. జిల్లా క్రికెట్‌ లో సేవలందిస్తు దూసు కుపోతున్న సల్మా భాను తన ప్రతిభా పాటవాలతో ఆంధ్రా మహిళా క్రికెట్‌ జట్టులోనూ స్ధానం దక్కించుకుంది.
అయితే 2007లో జాతీయ మహిళా క్రికెట్‌ జట్టుకు ఎంపిక కానప్పటికీ ఏమాత్రం నిరాశ, నిస్పుృహలకు తావియ్యకుండా మొక్కవోని ధైర్యంతో నిరంతరం ప్రాక్టీస్‌ చేస్తూ... ఎప్పటికప్పుడు శిక్షకులు, సీనియర్‌ క్రీడాకారుల సలహాలు తీసుకుంటూ 2008లో జరిగిన అండర్‌ 19 జట్టుకు ఎంపికైంది ఇదే ఏడాది జరిగిన సౌతిం డియా టోర్నీలో పాల్గొని తన స్పిన్‌ బౌలింగ్‌ ప్రతిభతో ప్రత్యర్ధి జట్టులైన తమిళనాడుపై 5 వికెట్లు, కర్ణాటకపై 3 కీలక వికెట్లు తీసి క్రీడా ప్రపంచం దృష్టితనవైపుకు మరల్చుకుంది.
సౌత్‌ ఇండియా టోర్నీలో సల్మాభాను చూపిన ప్రతిభా పాట వాలను గుర్తించి నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో స్ధానం దక్కించుకుని బెంగుళూరు క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సిఏ)లో ప్రత్యేక శిక్షణ పొందిం ది. అలాగే సౌతిండిమా సీనియర్‌ క్రికెట్‌ టోర్నీలో కూడా పాల్గొని 13 వికెట్లు తీసి తన బౌలింగ్‌ రుచి చూపించింది. ఇది అమె సౌత్‌ ఇండియా జట్టులో పూర్తి స్ధానం దక్కించుకునేందుకు ఉపయోగ పడిందనే చెప్పాలి. ఇక విశాఖలో జరిగిన ఆలిండియా ఇంటర్‌ జోనల్‌ పోటీల్లో ప్రతిభ చూపిన సల్మా భాను సీనియర్‌ జాతీయ క్రికెట్‌ శిక్షణా శిబిరానికికూడా ఎంపికైంది.
ఇటీవలే బిసిసిఐ ఆధ్వర్యంలో మహిళా చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొనే ఇండియా రెడ్‌ జట్టులొ స్ధానం దక్కించుకుంది. సల్మా ఆశలు ఆశయాలు ఫలించి... మన జాతీయ జట్టులో స్ధానం దక్కించుకుని అంతర్జాతీయ క్రికెట్‌లో తెలుగు'వాడి'ని రుచి చూపిం చాలని... మనసారా మనమూ ఆశిధ్దాం.

జాతీయ జట్టు స్ధానమే ధ్యేయం
ఎప్పటికైనా జాతీయ జట్టులో స్ధానం దక్కించు కోవాన్నదే తన కాంక్ష అని... ఇన్నాళ్లుగా తన ఎదుగు దలకు తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు కోచ్‌ సాగర్‌ చౌదరి శిక్షణ తన కెంతో ఉపయోగ పడిందని దీనికి తోడు చాలా మంది తనని ఉత్సాహ పరుస్తూ విజయాలు అధిరోహించేందుకు సహకరించారని చెప్పిం ది సల్మా భాను.
తనని తాను నిరూపించుకుని,,
2007లో బిసిసిఐ జాతీయ మహిళా క్రికెట్‌ సంఘాన్ని విలీనం చేసుకొని... అదే ఏడాది జాతీయ సెలక్షన్లు జరిపినప్పుడు సల్మా భాను ఆట తీరు సెలక్టర్లని ఆకట్టుకోలేక పోవటంతో... జాతీయ మహిళా క్రికెట్‌ జట్టుకు ఎంపిక కాలకపోయింది. అయినా నిరాస చెంద క నిరంతరం ప్రాక్టీస్‌తో తనని తాను నిరూపించుకుని క్రికెట్‌ ప్రపంచంలో తనకో స్దానం దక్కించుకుంది.