24, నవంబర్ 2011, గురువారం

కళ్ల ఊసులకు..కొత్త సొగసులు..

మౌనంగా భావాలు పలికించ గల సత్తా... మన శరీంలో ముఖ్యమైన అవయమైన కంటిదే..
అవి రెప్ప వేసినా...మూసినా..రెప రెపలాడినా... నవరసాలనూ అద్భుతంగా చూపించి...
మనిషి మనసులోని భావాన్ని...ఎదుటివారికి ఎలాంటి శబ్ధంలేకుండానే స్పష్టంగా చూపించే కళ్లు... నిన్నటి తరంలోనే కాదు నేటి తరంలోనూ... భవిష్యతరం కూడా కళ్లు కుమ్మరించే భావాలను
మరింత స్పష్టంగా కనిపించే విధంగానే వాటికి ఎన్నో విధాలైన మెరుగులు దిద్దుతూ వస్తున్నారు.
మనిషి అవయవయవాలలో ముఖ్యమైనది కన్ను. ఇది లేక పోతే... జీవితమే వృధా అన్న భావన మనిష్యుల్లో ఉన్నా... దాన్ని అధిగమించి ఉన్నత శిఖరాలకు ఎదిగిన వారూ లేకపోలేదు. కాగా నేటి తరం లో అందులోనూ యువతరంలో కళ్లకి కొత్త సొగసులద్దటం ఫ్యాషన్‌గా మారిపోయింది. ఎన్నో రకాల రంగు రంగుల కాస్మోటిక్స ఇపðడు కళ్ల ని మరింతగా చేసేందుకు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. ఈ క్రమం లోనే కళ్లకు మరిన్ని అందాలు రంగరించుకునేలా చేసేందుకు నేడు రాష్ట్రవ్యాప్తంగా అనేక బ్యూటీ పార్లర్లు కూడా పుట్టుకొచ్చాయి. వీటిలో ప్రత్యేక శిక్షణ పొందిన బ్యుటీషియన్లు మహిళల కళ్లకు వన్నెలద్దు తూ... వాటిని ఇట్టే ఆకర్షించేలా చేస్తున్నారు.
అయితే సందర్భాను సారంగా మీ మేకప్‌కి తగ్గట్టుగా ఈ కళ్లకీ మేకప్‌ ఉండాలి మినహా అతి అయినా..మరీ వెగటుగా ఏ చంద్రముఖినో చూ సినట్లు మీ ముఖం తయారవ్వటం ఖాయం. అంతెందుకు మీ స్నేహి తురాలు పెళ్లికి వెళ్లి... మిమ్మల్నే పెళ్లి కూతురనుకుంటారనుకుని సింగారించుకోకుండా మానేస్తారా కాస్త తక్కువగానైనా కొట్టొచ్చేట్లు మేకప్‌ చేసుకుంటారుగా... అదే ఏ చావు ఇంటికో వెళ్లేపðడు ఇష్టాను సారం మేకప్‌ చేసుకుని వెళ్తే ప్రశంసల మాట సంగతి దేవుడెరుగు మీ వెనకే మూతులు కొరుక్కుని... నగుబాటు చేయటం ఖాయం. అందుకే 'సింగార ప్రియులు' అయిన మహిళలు తమ కళ్ల మేకప్‌పై ఎంత శ్రద్ద్ధ వహిస్తున్నారో అందుకు సమయం సందర్భం కూడా చూసు కోవాల ని బ్యుటీషియన్లు చెప్తారు. సాధారణంగా మన కళ్లు బాదం గింజల ఆకారంలోనో, పద్మం పువ్వు రెక్కల ఆకారాన్నో.. చేపల ఆకారం లోనో ఉంటాయి. అందుకే పూర్వ కాలం కళ్లు పెద్దగా ఉంటే మీనాక్షి అని, కమలాక్షి అనే పేర్లు పెట్టేవారు. మరి మన కళ్లు ప్రత్యేకతల్ని కాపాడుతూనే అందర్నీ ఆకర్షించేలా రూపొందించాలంటే.... ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూనే కాస్మోటిక్సని వాడాల్సి ఉంటుంది.
కనుబొమ్మలదే ప్రాధాన్యత...
మీ కళ్లు ఏ ఆకారంలో ఉన్నా సరే వాటిని అద్భుతంగా చూపించగలిగేవి కనుబొమ్మలే అనటంలో సందేహంలేదు ఎవ్వరికీ. అంతలా ప్రభావితం చేస్తాయి. అందుకనేవెూ... సాధా రణ మహిళలల్లో కూడా ఐబ్రో పెన్సిల్స్‌ని వాడకం రాను రాను పెరుగుతోంది.
తమ అందాలను మరింత మెరుగు పరుచుకోవాలనుకునే మహిళలు కంటి రెప్పపై ఉన్న శ్రద్ద కన్నా ఈ కనుబొమ్మలపైనే ఎక్కువ శ్రద్ద చూపించాల్సి ఉంటుంది. కనుబొమ్మలు నిత్యం చర్మానికి అంటుకు పోయినట్లు ఉంటేనే మీ అందం మరింత విరజిమ్ముతుంది.
ఒక్కో సారి ముదురు రంగులను ఇష్టాను సారంగా కనుబొమ్మలపై మేకప్‌ వేసుకుంటారు కొందరు. ఇలా చేయటం వల్ల ముందు బాగానే ఉన్నట్లు అనిపించినా... కాస్త ఆరిపోగానే... కనుబొమ్మల వెంట్రుక లు పైకి వచ్చి మిమ్మల్ని అంద వికా రంగా చేసేస్తాయి. అందుకే ఒత్తుగా కనుబొమ్మలుంటే వాటికో షేప్‌ నిచ్చుకోవాలి. అదే లైట్‌గా ఉండే వారు ఐ బ్రోస్‌ సామాగ్రి వాడి జాగ్రత్తగా మేకప్‌ చేసుకుంటే సరి.
కళ్లనిలా మేకప్‌ చేసుకోండి...
కళ్లకి కొత్త సింగారాలు అద్దాలనుకునే వాళ్లు ఖచ్చితంగా ఇంట్లో చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ... నేచురల్‌ ప్రోడక లను వాడుతుండాలి.
నయనాలు మరింత హొయలొలికిస్తూ . మీకో ప్రత్యేకత సంతరించాలనుకుం టే... కేవలం బైటకు వెళ్లేపðడే కాదు ఇంట్లో ఉన్నపðడు కూడా కళ్లకి అందా లు అద్దుకొంటే బెటర్‌.
కళ్ల సైజు ఎంత ఉన్నా.. ముదురు రంగు లైనర్లు వాడితే... ఆకర్షణగా కనిపిస్తాయి. చిన్న కళ్లు ఉండే వారు ముదురు రంగు లైనర్లును కాస్త దళసరిగానే వేసుకుంటే...కళ్లను విశాలంగా... కనిపించేందుకు ఇవి ఉపయోగ పడతాయి. అలాగే పెద్ద కళ్లు ఉన్న వారు వీలైనంత తక్కువగా వాడితే బాగుంటారు. అయితే కంటి లోపలి భాగాలకు తగలకుండా మేకప్‌ వేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే కంటి ప్రమాదం ఏర్పడ టమే కాకుండా లేనిపోని ఇబ్బందులు కోరి తెచ్చుకున్న వాళ్లవుతారు.
బైట ఏపార్టీకో.. ఫంక్షన్‌కో వెళ్లాలనుకునే వారు కనీసం అరగంట ముందైనా మేకప్‌ చేసుకోండి. ఉదయం పూట బైట కెళ్లాలనుకుంటే ముదురు రంగు ఐ లైనర్లు వాడుతూనే సింగిల్‌ కోడ్‌ ట్రాన్స్‌పరెంట్‌ మస్కారాను కూడా వాడాలి. అదే సాయంత్ర వేళల్లోని పార్టీలకు అటెం డ్‌ కావాల్సి వస్తే మాత్రం ముదురు రంగు ఐలైనర్‌ వాడుతునే షాడోను కాస్త ఎక్కువగా వాడితే మరింత అందంగా కనిపిస్తారు. వీలైనంత వరకు నల్లటి షేడ్‌నే వాడితే బెటర్‌ లేదంటే మీ శరీరానికి తగ్గ ఇతర రంగులతో మేకప్‌ చేసుకుంటే మీ అందానికి మరింత మెరుగు కనిపిస్తుంది.
కను రెప్పలకీ అందాలద్దండి...
కళ్లని కాపాడంతో కీలక పాత్ర పోషించే కను రెప్పలకీ రంగులద్ది కొత్త అందాలు కల్పించవచ్చు. రెప్పలపై మేకప్‌ వేసుకునేపðడు చాలా జాగ్ర త్తలు పాటించాలి. రెప్పల వెంట్రుకలకి ఎంత నిగారింపు ఇస్తావెూ.. రెప్ప పైభాగం మేకప్‌ విషయంలోనూ అంతే జాగ్రత్తలు పాటించాలి. రెప్ప పైభాగంలో వేసిన రంగులకి వ్యతిరేక రంగు కనుబొమ్మకి కంటికీ మధ్య భాగంలో వేసుకుంటే అందం మరింత ఇడుమ డింప చేస్తుంది. అయితే ఈతరహా మేకప్‌ కొన్ని సంద ర్భాలలో మాత్రమే బాగుంటుంది. వీలైనంత వరకు సింపుల్‌గా ఉండేలా రెప్పలపై రంగులు వేస్తేనే బాగుంటారు.
సమయానుకూలంగా ఎం త లైట్‌ మేకప్‌ వేసుకుంటే అంత అందంగా కనిపిస్తారు.

జాగ్రత్తలు...
కళ్లకు అసలు హడావిడి మేకప్‌ తగదు. పగటిపూట జాగ్రత్తగా మేకప్‌ వేసుకున్న వెంట నే బైటకు వెళ్లకండి... కనీసం అర గంట అయినా వెయిట్‌ చేయండి. లేదంటే మేకప్‌లోని తడిపై సూర్యకాంతి తగిలి మీ ముఖం జిడ్డుగా మారిపోయే ప్రమాదం ఉంది. దాని వల్ల జిడ్డుకి ధుమ్మూ, ధూళి అంటి, ముఖంపై దురదలు, దద్దుర్లు రావచ్చు. ఇవి అలర్జీలుగా మారిపోవటవెూ... మొటిమలు తదితరాలకు దారి తీయ టవెూ జరగొచ్చు. అలాగే రాత్రి వేళల్లో మేకప్‌ని పూర్తిగా చెరిపి వేసుకోవాల్సిందే... లేదంటే సన్నితంగా ఉండే మీ ముఖ చర్మ మెద్దుబారి మందంగా తయ్యారవుతుంది.
మీరెంత మేకప్‌ వేసుకుని ఎదుటివారిని రెప్ప వేయించని విధంగా అందంగా తయారైనా... మీరు మాత్రం అడపా దడపా రెప్పలు వేయ టం మరిచి పోకండి. ఇలా రెప్ప వేయటం వల్ల మనం పడే శారీరక శ్రమల్ని వత్తుళ్ల నుండి సత్వర ఉపశమనం పొందుతాం.