వేసవి కాలమే... కాదు... శీతాకాలం లో నైనా... చలిపులి చంపేస్తున్నా.... ఐస్‌క్రీమ్ చూస్తే... తినాల్సిందే...
అనేక రకాల రంగుల్లో.. అనేక రుచుల్లో... వివిధ వాసనల్లో ఏదైశస్ధులైనా...
ఏ ప్రాంతానికి చెందిన వారినైనా అబ్బురపరిచేలా ఇట్టే ఆకర్షించేది ఐస్ క్రీమ్.
చిన్నా.. పెద్ద్ద, ముసలి, ముతక అని వయసు తేడాలే లేకుండా మక్కువ చూపిస్తుంటారంటే...
ప్రపంచంలో దీన్ని దాదాపుగా ఇష్టపడని వారే ఉండరనే చెప్పాలి.
చల్లగా... మనసుని ఆహ్లాదకర తీరాలకు చేర్చే సత్తా ఐస్ క్రీమ్‌ల సొంతం అని అన్నా ఆశ్చర్యపోనఖ్ఖర్లే...
ఒకప్పుడు కేవలం ఖరీదైన కుటుంబాలకే పరిమి తమైన ఈ ఐస్ క్రీమ్ నేడు సామాన్యుడికి చాలా అందుబాటు లోకి వచ్చింది. ఇప్పుడు సామాన్యుడి ఇంట కూడా ఏఫంక్షన్ చూసినా... అక్కడ జరిగే లంచ్, డిన్నర్, పార్టీ లు ఐస్‌క్రీమ్‌తోనే ముగియాల్సిందన్నంతగా మనం చేరి పోయామంటే...ఐస్ క్రీమ్‌లని ఎంతలా ఇష్టపడుతున్నా మో అర్ధం చేసు కోవచ్చు.
తొలి నాళ్లలో ఐస్ క్రీమ్ కోసం ప్రత్యేకంగా డైరీ పార్ల ర్లు ఉండగా... కాల క్రమంలో అవి దాదాపుగా ఐస్ క్రీమ్ పార్ల్లర్లుగా మారిపోయాయి. దీనికి తోడు డైరీ ఫాంలతో పాటు అనేక కార్పొరేట్ సంస్ధలు కూడా ఈ ఐస్ క్రీమ్ తయారీలోకి రావటంతో ఐస్ క్రీమ్ ఉత్పత్తి దారులు తమ అమ్మకాలను మరింత పెంచు కునే దశలోలో నేరుగా సామాన్యుడి ఇంటి ముంగిటికే ఐస్‌క్రీమ్ చేర్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించి ఐస్ క్రీమ్‌వ్యాపారం కూడా అభివృద్ది పధంలో పయనిస్తోంది.
తొలినాళ్లలో ఐస్ క్రీమ్‌ని నిలవ ఉంచేందుకు తగిన స్ధాయి సామా న్యుడికి లేక పోవటంతో అది ఏ రాజ ప్రాసాదాలకో, ధనవంతులు, సంపన్నకుటుంబాలకో పరిమితమైనా..ఈ క్రమంలో జరిగిన సాంకే తిక విప్లవం కారణంగా ధరలు తగ్గి... చాలా ఇళ్లలో రిఫ్రిజిరేటర్లు వచ్చి చేరాక సామాన్యుడికి బాగా అందుబాటులోకివచ్చింది.
మరోవైపు ఇంట్లో మహిళలు కూడా ఐస్‌క్రీమ్ తయారు చేసుకు నేందు కు తెగ ఆసక్తి ప్రదర్శించారు. ఇందుకు తగ్గట్టుగానే అనేక కంపెనీలు ఇందుకు కావాల్సిన సామగ్రిని అందుబాటులోకి తెచ్చాక ఇంట్లోనే ఐస్‌క్రీమ్ తయారవ్వటం ప్రారంభించింది.
ఇంతకీ ఐస్ క్రీమ్ వెనక కధ ఏంటంటే...
రుచికరంగా మనం తింటున్న ఈ ఐస్ క్రీమ్‌ల వెనుక పెద్ద్ద కధే ఉంది. దాదాపు 700 ఏళ్ల్ల క్రితం చైనాలోని మార్కొపోలో అక్కడి వంట వాళ్లు, మంచుకి పాలు చక్కెర కలిపి రుచికరమైన ఐస్‌ని తయారు చేసారు. అక్కడి నుండి ఇటలీ, ఫ్రాన్స్ దేశాలను చేరిన ఈ వంటకం అమెరికాతో సహా ప్రపంచమంతా విస్తరించినట్లు ఓ కధ ప్రచారం లో ఉండగా... అసలు ఐస్ క్రీమ్ అంటూ ప్రత్యేకంగా తయారు చేసిన వంటకమే కాదని నాటి కాలంలో ఇంగ్లాండ్ సామ్రాజ్యాన్ని పాలిస్తున్న మొదటి ఛార్లెస్ దగ్గర ఫ్రెంచి వంటకాలు తయారు చేసేందుకు ప్రత్యే కంగా ఓ వంట వాడు ఉండేవారు. మత్తు పానీయాలను తాగే క్రమం లో వాటిని చల్లబరుచుకుని తాగెె వాడు. ఓరోజు ఇదే విధంగా ప్రిన్స్‌కి కూడా అందచేయగా... మత్తు పానీయంతో తయారు చేసిన ఐస్ గడ్డ లు రుచికరంగా ఉన్నాయని ఈ విధానాన్ని ఎవ్వరికీ చెప్పవద్దని ఆదేశాలు జారీచేసినా... ఆ వంటవాడు తన సహచరులకు వివరించ డం... అది వారి ద్వారా యూరోపియన్లకు చేరటం జరిగిందని... అక్కడి నుండి ఈ ఐస్ క్రీమ్ రహస్యం అమెరికాకు పాకింద ని... అప్పట్లోనే న్యూయార్క్ కు చెందిన పలు వార్త్తా సంస్ధలు కధనాలు ప్రచురించినట్లు చెప్తారు. ఇలా అమెరికా పాకిన ఈ ఐస్ క్రీమ్‌పై అనేక మంది ఐస్‌ని రకరకా లుగా చేసే విధానాలపై ఎన్నో ప్రయోగాలు చేయటం వల్లనే ఇప్పు డు మనం తింటున్న ఐస్ క్రీమ్ పుట్టిందని చెప్తారు.
అంచెలంచెలుగా ఎదిగి...
1851లొ బాలిమోర్‌కి చెందిన జేకబ్ ఫన్సల్ తొలిసారి ఐస్‌క్రీమ్‌ని మార్కె ట్‌లో అమ్మకాలు ప్రారంభిస్తూ... ఓ షాపుని ఏర్పా టు చేయగా... 1903లో డెమాస్కస్ నుంచి వచ్చిన సిరియా దేశస్దుడైన ఎర్నెస్ట్ ఏ హాంనీ ఐస్ క్రీమ్‌లు ప్రత్యేకంగా తినేందుకు వీలుగా కోన్ లని తయారు చేసి... వీటిలో అమ్మడం ప్రారం భిం చాడు. ఈ క్రమంలోనే న్యూ జెర్సీకి చెందిన నాన్సీ జాన్సన్ సులభ పద్ధతిలో ఐస్ క్రీమ్ తయారు చేసేం దుకు మిషన్‌ని రూపొందించడంతో ఐస్‌క్రీమ్ వాణిజ్యం మరింత విస్తృతమైంది.
1904లో సెయింట్ లూయిస్‌లో
జరిగిన ప్రపంచప్రదర్శనలో తొలిసారిగా ఐస్ క్రీమ్‌ని ప్రద ర్శించగా...1920లో నీటి ఆవి రి, విద్యుత్ శక్తులతో ఐస్ తయారీ విధానం అందుబాటు లోకి రావటంతో 1921లో తొలి ఐస్ క్రీమ్ బార్‌ని తెర చారు. ఇక రెండో ప్రపంచ యుద్ద కాలంలోదక్షిణ ఫసిపిక్ నౌకా శాఖలో పనిచేస్తూ.. ఐస్ క్రీమ్ పై అనేక ప్రయోగాలు చేసిన బుర్టన్ బుచ్ బాస్కిన్ ఐస్ క్రీమ్ ఫీజర్‌తో తొలిసారిగా 31 రకాలలో ఐస్ క్రీమ్‌లని రూపొందించి ప్రపం చ దృష్టిని ఆకర్షించాడు.
1945లో పరిచయమైన ఇర్విన్ రాబిన్స్ అనే వ్యక్తితో కల్సి చేసిన అనేక ప్రయోగాల అనంతరం ప్రపం చానికి చాక్లొట్, వెనిలా, స్టాబెర్రీ ఫ్లావర్లను పరిచయం చేయగలి గాడు. దీంతో ఐస్ క్రీమ్ తయారీలోనూ పెను మార్పులు సంభవిం చాయ నే చెప్పక తప్పదు.
ఐస్ క్రీమ్
ఎలా తయారు చేస్తారంటే...
రిఫ్రిజిరేటర్లు వచ్చాక ఐస్ క్రీమ్‌లలో అనేక మార్పులు ఊపందుకున్నాయి. పాలు, చక్కెరలతో పాటు తేనె, కోడి గుడ్లు, చాక్లెట్లు, అనేక రకాల పళ్లు, ఆరోగ్యాన్ని అందించే మొలకలతో కూడా ఐస్ క్రీమ్‌లు తయారు చేయ టం ప్రారంభమైంది. కమర్సియల్ గా కూడా ఐస్ క్రీమ్‌లు అనేక రూపా లను సంతరించుకుని ఆకర్షణీయంగా తయా రవుతున్నాయి.
మిల్క్ సాలిడ్‌లు, నీళ్లు, పాలు, సుగర్, ఫ్యాట్స్‌పూర్తి స్ధాయిలో కలిపి వాటిని ఐస్‌క్రీం ప్లాంట్లలో 'పాయిశ్చరైజర్' చేస్తారు. ఆపై హోమోజె నెజేషన్ పేరుతో జరిగే ప్రక్రియతో అందులోని కొవ్వు పదా ర్ధాలని కరిగించి, దాదాపు 4 గంటల పాటు స్టోరేజ్ ట్యాంకులలో నిలవఉంచాక ఆమిశ్రమాన్ని విభజించి...కావా ల్సి న రంగులు, రుచుల కోసం ఫ్లేవర్లు కలుపు తారు. దీన్ని లిక్విడ్ అమోనియంతో 30 డిగ్రీల సెంటీగ్రేట్ టెంపరేచర్ వద్ద స్ధిర పరుస్తారు.
ఓవర్ రన్ తప్పని సరి...
ఈ ఏర్పాడ్డ గట్టి పదార్ధాన్ని నేరుగా తింటే కేవలం ఐస్‌గడ్డలు తిన్నట్లుగా ఉంటుంది కనుక గాలిని చొప్పించాల్సింటుంది. గాలి చేకూరిస్తేనే మెత్త్తబడి... తినేందుకు వీలవుతుంది. అందు కు అత్యధిక వేగంగా తిరిగే బ్లేడ్లు ఉన్న ఫీజర్లలో ఉంచి బాగా మిక్స్ చేస్తారు. దీని వల్ల ఐస్ క్రీమ్ తేలిక పడి పరిణామం కూడా పెరుగు తుంది.ఇలా ఐస్‌గా ఉన్న దాన్ని గాలి చొప్పించి క్రీమ్‌గా మార్చే విధానాన్ని ఓవర్ రన్ అని పిలు స్తారు. ఇంటి అవసరాలకు కావాల్సిన ఐస్ క్రీమ్‌లలో 80 శాతం ఈ ఓవర్ రన్ ఉండాల్సిందే.
ఆపై ప్యాకింగ్ చేసే ముందుకు అనేక పళ్లు, రక రకాల విత్తనాలతో అలంక రించి 'హార్డెనింగ్ రూమ్‌లో పెట్టి 23 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరే చర్‌లో 12 గంటలు తక్కువ కాకుండా ఈ హార్డెనింగ్ కొనసాగిస్తారు. దీని వల్ల ఐస్ క్రీమ్‌లో ఉన్న నీటి భాగం గడ్డ కట్టి... తీసుకు వెళ్లేందుకు వీలు కలిగేలా చేస్తుంది.
ఐస్‌క్రీం యూనివర్శిటీ...
నిజమే.. సెంట్రల్ ఇటలీలో ఐస్ క్రీమ్ తయారు చేయటంలో శిక్షణ ఇచ్చేందుకు ఏకంగా యూనివర్శిటీనే నెలకొల్పారంటే ఆశ్చర్యం కలగక మానదు. బొలొగ్నా సమీపంలో కారిగానీ గెలాటో పేరుతో ఏర్పాటు చేసిన ఈ విశ్వ విద్యా లయంలో గ్రాడ్యుయేషన్‌తో పాటు ఐస్ క్రీమ్ తయారీపై శిక్షణ ఇస్తారు అలాగే వారం నుండి నాలుగు వారాల సర్టిఫికేట్ కోర్సులు కూడా ఆఫర్ చేస్తోందీ విశ్వ విద్యాలయం.
ఐస్‌క్రీమ్ తయారీలో అనేక పద్దతులు, పరిశోధనలు చేసి అనేక పుస్తకాలు కూడా రాసిన మాల్కొల్మ్ స్టోగో 1992లో ఈ యూనివర్శి టీని స్ధాపించాడు. చైనా, స్పెయిన్, యూనైటెడ్ స్టేట్స్ ఇలా పలు దేశా ల్లో శాఖలున్న ఈ వర్శిటీలో అమెరికాతో సహ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నఅనేక దేశాల నుండి ఐస్ క్రీమ్ ప్రేమికులైన విద్యార్ధులు శిక్షణ పొందుతున్నారు.
అనేక రకాల సాంప్రదాయ కళలతో కలగల్సి ఐస్ క్రీమ్‌లని తయారు చేసేందుకు వీలుగా శిక్షణ ఇచ్చేందుకు ఈవర్శిటీలో 400 మంది ఉద్యో గులు పనిచేస్తుండగా..ఏటా 12 వేల మంది విద్యార్ధులు శిక్షణ పొందు తున్నారు. రస్ప్ బెర్రీ, హసెల్ నట్, ఫెనెన్న్ల్, మోర్టాడెల్లా, లెమన్ ఇలా పలు ఫ్లేవర్లకు ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఉంటుంది.
ఐస్ క్రీం తయారీ విధానాలపై సెమినార్లని నిర్వహించ డమే కాకుండా డెవలప్ మెంట్, ఎడ్యుకేషన్, ప్రోడక్ట్‌రీసెర్చు, ఫ్లేవర్స్, కన్సల్టింగ్ బుక్స్‌లపై శిక్షణ ఇస్తారు. అలాగే అన్ని కోర్సులలో టెక్నికల్, మార్కె టింగ్, మేనేజ్ మెంట్, విభాగాలలో శిక్షణ పొందిన విద్యార్ధులు అన్ని యూనివర్శిటీలలోగానే ప్రాక్టికల్స్‌ని కూడా చేసి అందులోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
ఈ యూనివర్శిటీలో చేరే విద్యార్ధులకు ఉచిత వసతిసౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అయితే నెలపాటు ఉండే ఒక్కో కోర్సుకు సగటున 1150 యూరోలతో పాటు ఇతర టాక్సులు వసూలు చేసా ్తరు. అంటే దాదాపుగా 19 లక్షల పైమాటే... ఇక వారం కోర్సులు, రెండు వారాల కోర్సులు కూడా ఉన్నాయి. ఇందుకు 6 నుండి 10 లక్షలు వ సూలు చేస్తారు.
మరి మీకూ ఐస్‌క్రీమ్ తయారీపై ప్రత్యేక శిక్షణ పొందాలనుకుంటే... ఈ కోర్సుల్లో చేరిపోండి. మరెందుకు ఆలస్యం.
సొంత తయారీకే మహిళల మక్కువ
బైట ఎన్ని పార్లర్లు వెలసినా. కమర్షియల్‌గా తయారయ్యే ఐస్ క్రీమ్‌లకి ధీటుగా నిలవకపోయినా... చాలామంది గృహిణిలు ఐస్ క్రీమ్‌ల తయారీ పట్ల మక్కువ చూపుతూ... స్వయంగా తయారు చేసుకుకొంటు సంతృప్తి చెందుతున్నారు. వెనిలా, చాక్లెట్, పిస్తా, ఫ్రూట్స్ ఇలా అనేక ఫ్లేవర్లు అందు బాటులోకి రావటంతో ఐస్ క్రీమ్ తయారీ ఈజీ అయిపోయింది. దీనికితోడుగా... పిల్లలు అమితంగా ఇష్టపడే... పళ్లను చాక్లెట్ ముక్కలను, కేకులని, ఫుడ్డిం గ్ ఐటమ్స్‌ని అద్దుతూ... ఆకర్షణీయంగా రూపొందించడమే కాకుండా వారి ఆరోగ్యాన్నిపరిరక్షించడంలోతగిన జాగ్రత్తలు తీసు కోవటం గమనార్హం.