ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న
ఫ్యాషన్ ప్రపంచం నేడు మన భారత మగువల మనసుల్నికూడా దోచుకుంటోందన్నది
వాస్తవం. దీంతో వారి వస్త్ర అలంకరణలో ఎన్నో మార్పులు పుటుకొచ్చాయన్నది
జగమెరిగిన సత్యం. నిన్న టి తరం చీరలు, లంగా ఓణీలు కేవలం పండగ పబ్బాలకో
పెళ్లి పేరంటాలకో పరిమితం చేసిన నేటి తరం మహిళలు కొత్త కొత్తగా పుట్టు
కొస్తున్న ఫ్యాషన్ ప్రపంచంలో అడుగు పెడుతూ.. మైమరిచిపోతున్నారు.
ఈ క్రమంలో ఇటీవల కాలంలో జీన్స్ ధరించిన మహిళలే కాకుండా వివిధ డ్రస్సులకు తగ్గట్టు బెల్టులు పెట్టడం బాగా పెరుగుతోంది. ఇన్‌షర్టు చేసుకుంటే దాని హూందా తనమే వేరుగా ఉండటంతో మహిళల్లో ఇన్ చేసుకుని, బెల్టు వాడే పద్దతి బాగా పెరుగుతోంది.
దీంతో వారి దృష్టి మార్కెట్‌లోకివస్తున్న అనేక రకాల బెల్టులపై పడింది. అనేక రంగుల్లో, కళ్లు చెదరగొట్టేలా కనిపిస్తున్న ఈ బెల్టులు విషయంతో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
స్త్రీల నడుము నాజూకుగా ఉంటుంది కనుక వీరు లావుపాటి, మందంగా ఉండే బెల్టులు వాడితే నడుము కంది పోయి, ఎలర్జీలు ఇతర రుగ్మతలకు దారి తీసే అవకాశాలున్నాయని... నడుముకు సరిపోయిన, మెత్తని, సన్నని బెల్టుని వాడుకుంటే మంచిదని వారు సూచిస్తున్నారు. బెల్టులు, లెదర్ షాపులకి వెళ్లేప్పుడు మీరు కంఫర్ట్ బెల్టు అడిగితే మంచిదని... వారు చెప్పారు.