16, డిసెంబర్ 2011, శుక్రవారం

సమతా మమతల సృజనశీల మల్లెమాల

మట్టివాసనలకు అక్షరాకృతులు జాల్వా ర్చిన సృజన శీల మల్లెమాల. అలతి పదాలతో..కవితామాలికలల్లి... సమాజం లోనిఅసమానతల్ని అక్షరాస్త్రాలతో తెగ నాడిన అభినవ వేమన మల్లెమాల. భావుకతను సామాజిక స్పృహతో రంగ రించి, ఆధ్యాత్మికతలో జీవన సత్యాల ను ప్రభోదించి రామాయణ కావ్యంలో తెలుగుతియ్యదనాలు నింపిన మహిత గుణశీల మల్లెమాల.
నిర్మోహమాటస్ధుడిగా...ముక్కుసూటిగా,నిశ్చల, నిశ్చిత అభిప్రాయలను వెల్లడించే వ్యక్తిగా ఆయనదో విలక్షణ శైలి.
ప్రముఖ నిర్మాత, కవి, సాహితీవేత్త ఎం.ఎస్‌.రెడ్డి. కేవలం సినీ నిర్మాతగానే కాకుండా సాహితీ ప్రపంచంలోనూ తన కవితా గుబాళింపులని 'మల్లెమాల'గా విరజిమ్మిన సామాజిక చైతన్యానికి కూడా కృషి చేశారు.
సమాజాన్ని చదివిన విద్యావేత్త

విద్యాలయాల్లో...విశ్వవిద్యాలయాల్లో చదుకోలేని మల్లె మాల ఈ సమాజాన్ని అన్ని విధాలుగా చదువుకుని విద్యావేత్తగా ఎదిగారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి సమీపంలోని అలిమిలి గ్రామంలో రంగమ్మ, రామ స్వామి దంపతులకు 1924 ఆగష్టు 15న జన్మించిన మల్లెమాల సుందర రామిరెడ్డి (87) గత కొంతకాలం గా అనారోగ్యంలో బాధప డ్డారు. వ్యవసాయ కుటుం బం లో పుట్టినా... కష్టాల కడగళ్లులో మునిగి అర్ధాకలి తో అలమటించిన సందర్భాలూ ఉన్నాయి. సాధారణ రైతు కుటుంబంలోపుట్టినా..వీధిబడిలో...అందునా రచ్చబండలె పాఠశాలుగాచదువుసాగింది. ఉపాధ్యాయుడు చెప్పిన పద్యాన్ని అంతా రాసినాతను రాయకుం డానే ఏకబిగిన చెప్పి ఏకసంథాగ్రాహిగా అప్పచెప్పడంతో అంతా అవా క్కయి.మంచి విద్యార్ధిగా గుర్తిపు తెచ్చుకున్నా కుటుంబ ఆర్ధిక పరిస్ధితి సహకరించకపోవటంతో చదువు చుట్ట బడలై... ఉద్యోగ వేట వైపు పయన మైంది. తండ్రి చేసిన అప్పు లకు కోర్టుజప్తు కు భూమి పోగా వ్యవ సాయం చేయాలని నాగ లికి దరి చేరినా సొంతవారే పాలెగాడని చెప్తున్నప్పు డు బాధప డ్డారు. చిన్న ప్పుడు అప్ప చెప్పిన పద్యాలే ఆయన లో స్పూర్తి రగిలించి... పెద్దయ్యాక కవిత్వంపై మక్కువ పెంచుకుని.. మల్లె మాలగా..అనేక అంశాలపై తన దైనశైలిలో కవిత్వాన్ని వెల యిం చి సహజకవిగావినుతికె క్కారు.
ఉద్యోగం... వ్యాపారం

ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబ పరి స్ధితి గమనించి... 1941లో ఎనిమిది రూపాయల జీతా ని కి మైకా డిపోలో ఉద్యోగంలో చేరారు మల్లె మాల. మూడేళ్లు అక్కడ పనిచేసాక జీతం రెట్టింపు అయినా ఏదో తెలియని భావనలు వెం టాడుతుండటంతో... తన దగ్గరున్న ఇరవై రూపా యలనే పెట్టుబడి గా పెట్టి తాటి పీచు అమ్మకాన్ని ప్రారంభించారు. ఆపై ఆప్రాంతంలో లభించే మిను ములు, పెసలు, మామిడి, తంగేడు, కందులు ఇలా పలు వాటిని కొనటం... అమ్మటం చేస్తు కొద్ది రోజు ల్లోన అంచలంచెలుగాఎదిగితన కుటుంబం కోర్టు జప్తు కాబడ్డ భూములకు రెట్టింపు మొత్తంచెల్లించి స్వాధీన పరుచుకుని...పూరింటిస్ధానంలోచిన్నపాటి పెంకు టిల్లు కట్టించి పూర్వ వైభవాన్ని తేగలిగారంటే వ్యాపార దక్షత ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
సంఘ సంస్కర్తగా...

అతి చిన్న వయసులో 1936లో స్వాతంత్ర ఉద్యమ సమయంలో వెంకటగిరికి వచ్చిన గాంధీజీ ప్రసంగానికి ప్రభావితుడై...గాంధీజీ పాదాలను స్పృశించారు. నాటి నుండి ఆయన చూపినబాటలోఅంటరానితనాన్ని నిర్మూ లించాలని అహర్నిశలూ కృషి చేసిన దేశ భక్తుడు. సంఘ సంస్కర్తగా సమాజానికి సేవలందిస్తూ .. సమాజంలో ప్రతిఒక్కరితో ఆప్యాయత గా అందరి హితాన్ని కోరుకునే వారాయన.సమతా,మమతల భావ నతో ఎన్నో కవితలని అందారు. బెంగాల్‌ కరువు వచ్చి న ్పుడు 'కష్టజీవి' బుర్రకధని తోటి కుర్రాళ్లతో కల్సి ప్రదర్శించి సుమారు పదివేల రూపాయలు కమ్యూని స్టు పార్ట్తీకి పంపారు.
సినీ ప్రస్ధానం

తన జీవితగమనంలో అనేక వ్యాపారాలు నిర్వహించిన ఆయన సినిమాలపై మక్కువతో గూడూరులో సుందర్‌ సినీ ధియేటర్‌ పేరుతో చిత్రప్రదర్శనశాలను నిర్మించారు. ఆపైమరికొన్ని ధియేటర్లకు యజమాని అయ్యారు. డ బ్బింగ్‌ చిత్రాలతో తన సిని నిర్మాణాన్ని ప్రారం భించిన ఆయన కౌముది పిక్చర్స్‌ సంస్ధని స్దాపించి చిత్ర నిర్మాణ రంగంలోకి దిగారు. 'భార్య' చిత్రంలో మొదలైన ఆయన సినీ నిర్మాణ ప్రస్థానం శ్రీకృష్ణ విజయం, వూరికి ఉపకారి, కోడెనాగు, ముత్యాల పల్లకి, ఏకలవ్య, రామబాణం, పల్నాటిసింహం వంటి చిత్రాలతో కొనసాగింది. పూర్తిగా బాలలతో ఆయన నిర్మించిన రామాయణం రాష్ట్ర ప్రభు త్వనంది అవార్డుతో పాటు, జాతీయ పురస్కారాన్ని కూ డా అందుకోవటం విశేషం. ఈ చిత్రం ద్వారానే జూనియ ర్‌ ఎన్టీఆర్‌ చిత్ర పరిశ్రమకి పరిచయమయ్యాడు. అంకు శం, ఆగ్ర హం, అమ్మోరు, అంజి, అరుంధతి చిత్రాలను తన కుమారుడు శ్యాం ప్రసాద్‌ రెడ్డితో నిర్మిం పచేసారు. ఎప్పుడూ కధా బలాన్ని నమ్ముకుని చిత్రాలు తీసిన ఆయన పలు చిత్రాలు పరాజయం పాలైనా ఏ మాత్రం దిగులు చెందకుండా... మరింత పట్టుదల తో మరింత అద్భుత చిత్రాన్ని రూపొందించిన ఘనుడాయన.స్వయంగా నటు డిగా అంకుశం చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో కని పించిన ఆయన 'వెలుగు నీడలు' చిత్రంలో ప్రధాన భూమికని పోషించారు.

కవిగా...

మల్లెమాల చక్కని, చిక్కని భావుకుడు మా త్రమే కాదు సమాజం లోని అన్యాయాలను, దురాగతాలను చూసి చలించి పోయిన మాన వతా మూర్తి. అందుకే భావుకతతో అద్భు తమైన పాటల్ని అటు సిని మాలకు మల్లెపూల పరిమళాలు వెదజల్లే కవితల్ని ఇటు సాహితీ ప్రపంచానికి అందిచారు. అదే సమయంలో నిలు వెత్తు సామాజికి స్పృహతో విప్లవ గీతాల్ని, కవితల్ని వెలయించారు. అయితే ఏ రచన చేసినా అచ్చతెలుగులో అలతి పదాలతో మాత్రమే రచనలు చేయంటి మల్లెమాల ప్రత్యేకత. 'ప్రతిదినం ఒక గ్రంధ మైనా చదవందే అడుగు ముందుకు పడదు... ఒక పద్య మైనా రాయందే నిద్రరాదంటూ...' తన సాహిత్యాభిమా నాన్ని చాటుకుంటూ పద్యం తన ఆరోప్రాణంగా అనేక సందర్భాలలో చెప్పారు. సరస్వతీ మాతే తనని పెంచి పోషిస్తోందని... చెప్పుకుని తన ఇంటి పేరునే కలం పేరుగా మార్చుకుని...మల్లెమాలగా.. సినీ కవిగా పలు చిత్రాలకు సుమనోహ రమైన గీతాలు అందించిన ఆయన తన కంటూ ఓ ప్రత్యేకతని దక్కిం చుకున్న ఆయనసహజ కవి, ఆంధ్రా వాల్మీకి లాంటి బిరుదాంకితుడు కూడా... అందుకు తగ్గట్టే ఆతని రాసిన గ్రం ధాలు, రచనలు, పద కవితలు సహజ త్వానికి దగ్గరగా.సాధారణ పదజాలం తో ఉండటం విశేషం. తరాల అంత రాలను తెగనాడుతూ'వృషభ పురా ణం' అనే గ్రంధం ఆవిష్క్కరించారు. తన ప్రతిభాపాటవాలను చాటే విధం గా వాల్మీకి రామాయణాన్ని అనుస రి స్తునే ఆయన విరిచించిన 'మల్లె మాల రామయణం'లో సంస్కృత ఛందస్సుకు తెలుగుదనాన్ని కలగ లిపి ఎక్కడా కృత్రిమత్వానికి చోటి వ్వకుండా పాత్రోచితమైన కల్పనలు చేస్తూ... సుకుమార పద్యాలనుఅద్భుతంగా మల చి రుచి చూపించారు. ఆధునిక కవిత్వ పోకడలున్న కాలంలోనూ పద్య కవితలతో తన సత్తా చూపి కవి సమ్రాట్‌ విశ్వనాధ సత్యనారాయణ ప్రశంసలందుకున్నారాయన. తేనెటీ గలు, వాడనిమల్లెలు, భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్ర, నివేదన, భారతరత్నాలు వ ంటి రచ నలతో పాటు అనేక మంది సుప్ర సిద్దులను ప్రశంసిస్తూ ఆయన


రచించిన 'ఎంద రో మహాను భావు లు' అన్న గ్రంధం వేనోళ్ల ప్రశంసలందు కుంది. ఇటీవలే తను రాసిన 10 గ్రంధాలను ఆవిష్కరించారు.ఇటీవల ఆయన 'నా కధ' పేరుతో ఆయ న రచించిన ఆత్మకధలో తన సినీ ప్రస్దానంలో ఎదురైన అనేక ఒడిదుడుకులను ప్రస్తావిస్తూ.... పలు చిత్రాల నిర్మాణాల సమయంలో సొంత కుమారుడితో పాటు అనేక మంది సినీ ప్రముఖులపై తనదైన శైలిలో విమర్శ నాస్త్రాలు సంధించడంతో ఆ పుస్తకం వివాదాస్పదమైంది?
సత్కారాలు... పురస్కారాలు...

సాహితీ ప్రపంచానికి మల్లెమాల సేవల్ని గుర్తించిన అన్నామలై యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ పురస్కా రాన్ని అందించగా...'మహిత వినయశీల మల్లెమాల ' అన్న మకుటంతో రాసిన నిత్యసత్యాలకు గానూ అభినవవేమన బిరుదు లభించింది. జాతీయ అవార్డు,తో పాటు 2005లో రఘుపతి వెంకయ్య అవార్డు ఇటీవలే ఆత్రేయ పురస్కారాన్ని సైతం అందుకున్నారు. ఇక అనేక స్వఛ్ఛంధ సంస్ధలు అందించిన పురస్కారా లు లెక్కకు మిక్కిలి.
రాజకీయానుబంధాలు...
1957లో గ్రామపంచాయితీ ఎన్నికల్లో గెలిచి రాజకీ యాలలోకి వచ్చిన ఆయన సంజీవరెడ్డి హయాంలో సమితి అధ్యక్షుడిగా అవకాశం వచ్చినా దానిని వదులు కున్నాకాంగ్రెస్‌తో తన అనుబంధాన్ని చాటుకుంటూ... వచ్చి చివరకి మాజీ ముఖ్యమంత్రి విజయభాస్కర రెడ్డితో వియ్యమంది బంధుత్వంగా మార్చుకున్నారు.
ఎఫ్‌డిసి చైర్మన్‌గా...
ఆయన నిర్మించిన డాక్యుమెంటరీ 'కన్నీటి కెరటం' దివిసీమ కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించి అందరి ప్రశంసలు అందు కున్న క్రమంలో అప్పటి ముఖ్య మంత్రి మర్రి చెన్నారెడ్డి మల్లెమాల సేవలను గుర్తించి 1990లో చలనచిత్ర అభివృధ్ధి
మండలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి. సమస్యలతో సతమతమవుతున్నదానిని ఒక గాడీలో పెట్టారు.


ఆంధ్రప్రభతో అనుబంధం
అంధ్రప్రభతో మల్లెమాల అనుబంధం సుదీర్ఘం, అత్యంత బలీయం. ఆవిషయం ఆయనే వివిధ సాహితీ, సాంస్కృతిక సభల్లో చెప్పేవారు. ఒక్క రోజు ఆంధ్ర ప్రభ ప్ర్రతిక ఆయనకు రావటం ఆలస్యమైతే వెంటనే ఫోన్‌ చేసి ఫిర్యా దు చేసేవారు. ఎన్ని పేప ర్లు వచ్చినా... ముందు గా ఆంధ్రప్రభనే చదువు తానని దశాబ్దా లుగా ఇది తన అలవాట ని పేర్కొన్నారు. 'చివరి అంకం'లో కైడా ఆయన రచనలు చేసింది ఆంధ్ర ప్రభకే శరీరం సహక రించక పోయినా... ఒక లేఖకుని ఏర్పాటు చేసుకు ని రచనలు చేసి ఒకటికి నాలుగు సార్లు కరెక్షన్స్‌ చేయించి 'మల్లెమాల కాలమ్‌' కి పంపేవారు. 'కాలమ్‌' బావుండక పోతే.. ఆపేయ మని, మొహమాట పడవద్దని మధ్య మధ్యలో సంపాదకుడికి ఫోన్‌ చేసేవారు. అంధ్రప్రభ కార్యాల యంలో ఏప్రియల్‌ రెండవ తేదీన నిర్వహించిన ఉగాది కవితా విజేతల బహుమతీ ప్రధా నోత్సవ సభకు ప్రత్యేకంగా హాజరయ్యారు.
ఈ సంద ర్భంలో ఆయతీసుకు వెళ్లేందుకు చెయ్యి పట్టుకోగా ఒళ్లు పెనంలా కాలిపోతూ ఉంది. వాకరు తో నడుస్తున్న ఆయన్ని 'ఏమిటి సార్‌! ఒళ్లు ఇంత వేడిగా ఉంది? అని ప్రశ్ని స్తే... 'బాగా జ్వరం... కానీ ఆంధ్ర ప్రభ కార్య క్రమానికి రాకుండా ఎలా? అందుకే ఓపిక చేసుకుని జ్వరమైనా లెక్క చేయకుండా వచ్చాను' అన్నారు. తాను వ్యక్తుల్నిగానీ, వ్యవస్ధలని గానీ అభిమానిస్తే... ఆ అభి మానం అంత ప్రగాఢం గా ఉంటుందనటానికి ఇంతకు మించిన ఉదాహ రణ మరొకటి ఏముం టుంది. నిలువెత్తు వ్యక్తి త్వానికి, సాహితీ సేద్యాని కి, తెలుగు ఆత్మ గౌరవా నికీ ప్రతీకగా భాసిల్లే మల్లెమాల చివరి రోజుల్లో మృత్యువుని కూడా అంతే ధై ర్యంగా ఆహ్వానించారు. చావంటే తనకు భయం లేదని నిర్భయంగా వెల్ల డించేవారు.
అయితే తుది శ్వాస వరకు తన రచన కొనసాగాలన్న తన అభిలాషను వ్యక్తం చేసారు మల్లెమాల. అటు వంటి ఆయన కలానికి బ్రేకులు వేసింది కుటుంబ సభ్యులే కావటం అత్యంత విషాదం అంటారు ఆయన గురించి తెలిసిన వారు. ఏది ఏమైనా సహజ కవి మల్లె మాల సాహితీ ప్రపంచంలో ఒక సంచలనం.

వ్యధమిగిల్చిన 'ఇది నా కథ'
తను చనిపోయేలోగా 'ఇది నా కథ' గ్రంధం పూర్తి చేస్తానో లేదో అని యం.యస్‌.రెడ్డి తెగ బాధపడేవారు. ఇదే విషయాన్ని చాలా మంది ప్రముఖుల వద్ద, సాహితి, సంస్కృతి సభల్లో బహిరంగంగా వ్యక్తం చేసేవారు. అయితే ఆయనకు ఆ గ్రంధ రచన పూర్తిచేయడం ఆనందం కలిగించిందేమోకానీ, అంతకు మించి ఇబ్బంది కలిగించిందనే చెప్పాలి. 'ఇది నా కథ'లో కొంతమంది ప్రము ఖులపై ఆయన చేసిన వ్యాఖ్యానాలు పెద్ద దుమా రాన్ని లేపాయి. ఈ దుమారాన్ని చల్లార్చడానికి ఆయన కుటుంబసభ్యులు, హడావుడిగా మార్కెట్‌ నుండి కాపీలు వెనక్కి తెప్పించి, బహిరంగ మార్కెట్లో కాపీ దొరక్కుండా కట్టడి చేసినట్టు అప్పట్లో చెప్పుకున్నారు. అంతేకాకుండా సుప్రసిద్ధ నిర్మాతగా ఇమేజ్‌ సంపాదించుకుని, పరిశ్రమలో మంచి సంబంధబాంధవ్యాలు నెరపుతున్న ఆయన కుమారుడు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి తన ఈ వ్యవహారం తననెప్పిగా తయారైందని, ఆయన కుటుంబసభ్యులు భావించి, మల్లెమాల మీద ప్రత్యక్షంగా ఆగ్రహం వెలిబుచ్చారని, కొంతకాలం పాటు ఫోన్‌ సౌకర్యం కూడా అందుబాటులో లేకుండా చేశారని, ఆయన రచనలకు సహాయకుడిగా పనిచేసే వ్యక్తిని కూడా తీసివేసి, ఆయనకు దాదాపు బయటి వ్యక్తులతో సంబంధం లేకుండా ఒంటరిని చేశారని, చిత్రపరిశ్రమలో, సాహితీ రంగాల్లో చెప్పుకున్నారు.