తానెంత ఎదిగినా... ఇల్లాలుగా.. మాతృమూర్తి పదవులకే ప్రధమస్ధానం ఇచ్చే మహిళలు...
అన్ని బాధ్యతల్ని సరితూకం చేసుకుంటూ... నెగ్గుకు వస్తున్నా సతమతం తప్పట్లేదన్నది నిజం...
ఈ తరుణంలో ...నిమిషాలలో పనులు చేసి పెట్టే అద్భుత యంత్రాలతో పాటు..
కొత్త తరహా వంటిల్లులు అందుబాటుకిి వచ్చి కొంత సేద తీర్చేలా చేస్తున్నాయనే చెప్పాలి.
మహిళలు... మహరాణులూ... అంటూ కవితలల్లిం ది ఎవరో తెలియదు కానీ... నేటితరంలో అన్ని రంగాలలో దూసుకుపోతున్న యువతిని చూస్తుంటే.. వంటింటికే కాదు యావత్ ప్రపంచానికీ మహరాణు లమే అని నిరూపిస్తున్నా రనిపిస్తుంది. ఆర్కిటెక్చర్లు గా, డిజైనర్లుగా, ఇంజనీర్లుగా... రిసెప్షన్ నుండి... మేనేజింగ్ డైరెక్టర్ల వరకు, సామాన్య ఉద్యోగి నుండి దేశాధ్యక్షుని వరకు.. పైలట్ నుండి వ్యామ గామి వరకు ఎక్కడైనా తనకో ప్రత్యేకత నిరూపించుకుం టూ...సత్తా చూపిస్తూ..ఎన్నెన్నో కీర్తిప్రతిష్టల్ని సంపా దిస్తునే ఉన్నారు. అయినా ఆడవారికి అమ్మగా లాలింపు... పాలింపు తప్పనిసరి తన చేతివంటని ఆనందంగా తింటున్న బిడ్డల్ని చూసి ఆనందించని అమ్మ ఉండదు. ఈ క్రమంలోనే అమ్మ వంట చేసేం దుకు అనువుగా వంటిల్లు కూడా ఉండాల ని..ఆమెలోనూ నూతనోత్సాహం నింపా లన్న పలు వురి ఆర్కిటెక్చర్‌ల ఊహలలోంచి రూపు దాల్చినదే ఆధునిక వంటిల్లులు.
ఆధునిక పరికరాలు రాని రోజుల్లో కూడా మన ముం దు తరాలవారు ఉమ్మడి కుంటుంబాలలో ఆనందంగా వంట చేసుకుని హాయి, హాయిగా తిని ఆరోగ్యకంగానే ఉండే వారు.
నేడు అన్ని అందుబాటులోకి వచ్చినా. ఉమ్మడి కుటుంబాలు అవసరార్ధం విచ్చిన్నమైన క్రమంలో ఇంట్లో ఉన్న నలుగురికి వంట చేసేందుకే నానా హైరానా పడిపోతూ... చెమటలు పట్టేస్తూ... వంటెవడు కనిపెట్టా డురా భగవంతుడా అని విసుర్లు విసురుతున్న మహిళల్ని చూసి... నేడు వంటిల్లు తెల్లబోతోంది.అసలు దాని ముఖం చూసేందుకు కూడా నచ్చని నేటితరం అమ్మాయిల్లో చాలా వరకు వంట రాకపోవటం కూడా అదో కారణం కావచ్చు.
పూర్వంలో మన బామ్మలు, అమ్మమ్మలు...కాలంలో పిడక ల పొయ్యలు, కట్టెల పొయ్యలు, బొగ్గుల కుంపట్లు.. ఇలా నిత్యం ఇంట్లో అగ్నిహౌత్రం వెలుగుతూ ... ఇల్లంతా మసక బారు స్తున్నా... ఏం లేకు న్నా... అంత రుచి కరంగా అమ్మ చేసిన వంట నేడు లభించిన దాఖలాలే లేవన్న ది నిన్నటి తరం వారు చెప్పే మాట. రుబ్బురోళ్లలో నలిగిన పిండితో చేసిన అట్ల రుచి, రోకళ్లతో కొట్టిన పొడుల గుభాళింపులు, తిరగ ళ్లలో నలిగిన కందిపొడి.. బండలతో చితక్కొట్టిన పచ్చళ్లు, అప్పడాల కర్రలు ఇలా వేటికవే ప్రత్యేకత సంతరించు కునేవి. నాడు ఆ పొగ పొయ్యలపై కళ్లు మండుతున్నా... పిండి వంటలు, మిఠాయిలు చిటికెలో ఎలా చేసి పడేసే వారో నేటికీ అర్ధం కాని ప్రశ్నే...
కానీ నేడు గ్రేండర్లు, మిక్సీలు, స్టౌల్‌లు, ఒవెన్లు ఇలా అన్నీ అందుబాటులోకి వచ్చినా... మనం మాత్రం సమయా భావం పేరుతో ఏ స్వగృహా ఫుడ్స్‌పైనో, కర్రీ పాయింట్ల పై నో ఆధార పడి గడిపేస్తూ వంట ప్రాధా న్యతని తగ్గించేసు కుంటున్నాం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయటం నేడు పెరుగు తున్న ఆర్ధిక భారాల దృష్టా తప్పనిదే కావటం.... పిల్లలు చదువులు, ఇంట్లో ఉరుకులు, పరుగులతో పనులు చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్లేందుకు సమయం తక్కువ గా ఉన్న క్రమంలోనే దాదాపు ప్రధాననగరాలలో ప్రతి వీధిలో, గల్ల్లీ చివర్లలో కర్రీ పాయింట్లు పుట్టుకొచ్చాయి. స్వీట్ స్టాళ్లు మూడు పువ్వులుగా వర్ధిల్లుతున్నాయి.
కత్తి పీటల స్ధానంలోకి చాకులు, పీలర్లు వచ్చి పడ్డాయి. ఆ క్రమంలో నేడు కూరగాయలు క్షణాల్లో అన్నింటినీ కట్ చేసే యంత్రాలు, పపð వేస్తే చాలు క్షణాల్లో రుబ్బి పెట్టే గ్రేండర్లు, మంత్రం వేసినట్లు నిమిషాల్లో అన్నం, కూరలు, చేసి పడేసే ఎలక్ట్రానిక కుక్కర్లు, చపాతీలు, పుల్కాలకు రోస్టర్లు, టి, కాఫీలకూ ప్రత్యేకంగా మిషన్లు అందుబాటు లోకి వచ్చినా... చాలా మంది తమ వంటిళ్ల ని ఇష్టాను సారంగా వాడిపడేస్తుంటారు. దీంతో పని మనిషి కన్నా.. ఆ వస్తువులు పాడైతే బాగు చేయించడానికో.. తిరిగి కొను గోలు చేయటానికో ఎక్కువ అవుతుందని గమనిం చుకోండి.
మరి కొందరైతే అవసరం ఉన్నా లేకున్నా ఇష్ట్టానుసారం వస్తువుల్ని కొనేస్తుంటారు. దీంతో బైటకు కనిపిస్తే ఇబ్బంది అని అన్నీ వంటగదిలోనే చేరిపోతుండటంతో ఉన్న గది ఇరుకై ఇబ్బందులు... విసుగు తెప్పిస్తుంటాయి. అద్దె ఇళ్ల లో ఉన్న వాళ్లు ఎలానూ సర్ధుకు పోక తప్పదు... కానీ సొంత ఇళ్లు ఉన్నవారికోసం నేడు ఎన్నో హంగులతో అవసరాలకు తగ్గట్టు అధునాతనరీతిలో రూపొందిన వంట ిళ్లు వచ్చేసాయి.
వంటింటి ఓ వైపునే అన్ని ఉండేలా చూసుకునేవారు గతంలో.. కానీ నేడు రెండు వైపులా ర్యాకలుే, చిన్నపాటి రాతిపలకలు వేసి.. ఉన్న తక్కువ స్ధలాన్నే విశాలంగా చేస్తున్నారు. ఇందుకు ఎక్కువ శాతం లేత గ్రానైట్ వాడుతుం డటంతో ఆహ్లాద కరంగా ఉంటుంది. ఇక వంటిల్లు చిమ్మచీకట్లు చిందేలా కాకుండా వెలుగులతో ప్రతిబింబించేలా చేస్తూనే... వంటల నుండే వెలువడే ఆవిర్లు పోయేందుమార్గాలను ప్రత్యే కంగా ఏర్పాటు చేస్తారు. ఫ్రిజ్, ఒవెన్, గ్రేండర్, మిక్సీ ఇలా ప్రతి ఎలక్ట్రానిక వస్తు వు వినియోగానికి వీలు గా ప్లగ్‌పిన్‌లు ఏర్పాట్లు పాత్రలు శుభ్రపరుచుకునే షింక మొదలు, క్రిందన ఉండే మ్యాట్లు వరకు... అన్ని శుభ్రపరుచుకునే ఏర్పాట్లు గిన్నెలు ఉంచే స్టాండ్స్... వంటకు దినుసులు అందు బాటు లో ఉంచేలా నిర్మిస్తున్న అలమరాలు ఇలా అన్ని ఓ ఎత్తయితే... వంటింట్లో ఇండోర్ ప్లాంట్ల కు సైతం కాసింత చోటిచ్చి మరింత ఆహ్లాదపరి చేలా చేస్తున్నారు నేటి ఆర్కిటెక్చర్లు.
మరో వైపు ఆధునికంగా ఉన్న చిన్న పాటి స్ధలంలోనే గుండ్రని ఆకారంలో షింక, స్టౌవ్, సామాన్లు ఉంచేందుకు అలమరాలు, ఒవెన్, ఫ్రిజ్, ఇలా తదితరాలు పెట్టుకునేందుకు ప్రత్యేక అమరికల్ని ఏర్పాటు చేసి అందిస్తున్నారు. వీటిలో చాలా మేరకు గ్యాస్ సిలండర్లను ఇంటి బైటే ఉంచి ప్రత్యేక పైపు ద్వారా స్టౌకి గ్యాస్ పంపడం వల్ల ప్రమాదాలు చాలా తక్కువగా ఉండటంతో నేటి ఆధునిక మహిళలు పెద్ద పెద్ద వంటిల్లు స్ధానంలో చిన్నగా చూసేందుకు అందంగా కనిపి స్తున్న ఈ వంటిల్లు పట్ల మక్కువ చూపిస్తున్నారు.
ఈ క్రమంలోనే పాత వంటిల్లునే మీకు నచ్చిన రీతిలో రూపొందిం చేందుకు నిర్మాణ కంపెనీలు, ఆర్కిటెక్చర్లు ప్రత్యేక తరహాలో మీకు ఉన్న ప్రదేశానికి తగ్గట్లు వీటి నిర్మాణం చేస్తున్నారు. వంటింటికి సంబంధించిన వివిధ పరికరాలను అందిచే కంపెనీలు కూడా తమ తమ ఔట్‌లెట్ల లో ఇందుకు సంబంధించి అనేక రకాల డిజైన్లు అందిస్తున్నాయి.
ఇప్పటికే మార్కెట్‌లో అందమైన రంగుల్లో వివిధ రకాల డిజైన్లతో పలు షింకలుే, ట్యాప్‌లు, టేబుల్స్, ప్రొవిజన్ స్టాండ్స్, ఐటమ్ స్టాండ్స్, హ్యాంగింగ్ స్టాండ్స్, ఇలా అన ేకం లభిస్తున్నాయి... ప్రొవిజన్స్ స్టాండ్స్‌లలో ఏవి ఎక్కడు న్నాయని పేర్లు రాసుకునేందుకు ఉన్నవి కొన్నయితే... ఏకంగా పారదర్శకంగా కనిపించేలా అన్ బ్రేకబుేల్ ప్లాస్టికతోే తయారైన సీసాలతో కల్సి సెట్‌గా లభిస్తున్నవి మరి కొన్ని. ఇక వాష్ బేసిన్ పక్కన మిర్రర్లు,టవల్ స్టాండ్లు... పాత్రలు శుభ్రం చేసే సబ్బులు, పౌడర్లు, లిక్వి డ్లు ఉంచుకునేందుకు అక్కడే ప్రత్యేక అలమరాలు... అవి కడగటం పూర్తి కాగానే మీ చేతులు తుడుచుకునేందుకు తువ్వాలు పెట్టుకునే స్టాండ్లు, కాస్త ఖర్చెక్కువైనా పర్వాలే దని అనుకుంటే... పనిమనిషితో సంబంధంలేకుండా ఇంట్లో మీరు నిత్యం వాడుకునే పాత్రలు కడిగి పెట్టే డిష్ వాషర్లు సైతం వీటిలో ఏర్పాటు చేస్తారు. ఆధునిక వంట గదిలలో వచ్చి... ఏదీ కనిపించ డం లేదనేందుకు లేకుండా వచ్చి చేరాయి. మరెందుకు ఆల స్యం మీ ఇంటిని కూడా అందంగా చక్కదిద్ధుకోండి..