చూపులతో గుచ్చిగుచ్చి చంపకే- అంటూ ఒక
ప్రేమికుడు వాపోతాడు. ప్రియురాలి చూపు కోసం పరితపించే ప్రియుల గురించి
విన్నాం. కోర చూపులు, ఓర చూపులు మహిళల సొంతం. భావాన్ని కళ్లలోనే పలికించగల
నేర్పరులు వాళ్లు. అందమైన, ఆల్చిప్పల్లాంటి కళ్లతో వేలాది భావాలు చూపించే
భామలు ఉన్నారు. ఇక్కడ స్టిల్స్‌లో కనిపిస్తున్న ఐదుగురు నాయికలు అనుష్క,
తాప్సీ, స్నేహఉల్లాల్, తమన్నా, శ్రద్ధాదాస్‌లను చూస్తుంటే ఒక్కొక్కరూ
ఒక్కొక్క విధమైన చూపుతో. భావాన్ని ఇట్టే పలికించే సామర్ధ్యం ఉన్న వాళ్లు.
అనుష్క చిరునవ్వుతో, తాప్సీ ప్రశ్నార్థకంగా, కోర చూపులో స్నేహాఉల్లాల్,
తమన్నా మత్తెక్కించే చూపుతో, ఓర చూపులో శ్రద్ధాదాస్ కనువిందు
చేస్తున్నారు.