బస్టాప్‌లో బస్ కోసం నిలబడతాం. దూరం
నుంచి బస్ వస్తోంది. చెయ్యెత్తాం. తీరా బస్ ఆగలేదు. మనం మామూలుగా కాకుండా
తల నిమురుకున్నట్టుగా చేతిని కిందికి దించుతాం. ఏదో ఒక పార్టీకి వెళ్లాము.
అందరికంటే మన బట్టలు సరిగ్గా లేవని మనసులో అనిపించింది. ఇక పార్టీ అయి
ఇంటికి వెళ్లే వరకు ఆ ఆలోచన వదలదు. ఆఫీస్‌లోనో, ఇంట్లో బంధువులో మనకు తగిన
విలువ ఇవ్వలేదు. మనసులోంచి ఆ విషయం ఎంత తీసేయాలన్నా సాధ్యం కావటం
లేదు-ఇవన్నీ మనందరికీ ఎపðడో ఒకపðడు జీవితంలో ఎదురయ్యేవే. ఇతరుల అంచనాలకు
తగినట్టుగా లేమేవెూ అనే ఆలోచన. మనల్ని చూసి ఎవరేమనుకుంటున్నారో అనే బిడియం -
నిరంతరం మనుషుల్ని వెంటాడుతుంది. కొందరిలోఎక్కువగా, కొందరిలో తక్కువగా.
ఇలాంటి అనవసరమైన విషయాలు మనల్ని అతిగా బాధపెడుతుంటే జీవితం పట్ల మన ఆలోచనలు
సరిగ్గా లేవని అర్థం. తేలిగ్గా తీసుకోవాల్సిన విషయాలను కూడా భారంగా
చూస్తున్నామంటే కొన్నాళ్లకు మనకు మనమే భారంగా మిగులుతాం -
టేకిటీజీ పాలసీ లేకపోతే....
- జీవితం సంక్లిష్టంగా లేదు...మన ఆలోచనలే అలా ఉన్నాయి. జీవితం ఎపðడూ సింపుల్‌గానే ఉంటుంది. సింపుల్‌గా ఉండటంలోనే సత్యముంది - ఆస్కార్‌వైల్డ్
- ఏడుపు అనేది మన కన్నీళ్లను వృథా చేసే ప్రక్రియ, ఎవరికోసం ఏడుస్తావెూ వారు మన కన్నీళ్లకు అర్హులు కారు. అలాంటి అర్హత ఉన్నవారు అసలు మనకు కన్నీళ్లే తెప్పించరు.
- సంతోషం అనేది సీతాకోకచిలుక. మనం వెంటబడుతుంటే దొరకకుండా తప్పించుకుంటుంది. వదిలేసి ప్రశాంతంగా కూర్చున్నపుడు వచ్చి మన భుజంపై వాలుతుంది
- బాధలు తప్పవు... ఎదుర్కొనే శక్తిని పెంచుకోవాలి సమస్యలు తప్పవు... అధిగమించే నైపుణ్యం పెంచుకోవాలి. సవాళ్లు తప్పవు... పోరాడే తెలివితేటలు పెంచుకోవాలి
- భగవంతుడు ఈ భూమ్మీద బోలెడు కామెడీ నాటకాలు రాశాడు. అయితే జరిగిన పొరబాటు ఎక్కడంటే వాటిలో నటించడానికి సరైన నటుల్ని ఎంపిక చేసుకోలేదు.
- తెలివితేటలు అనుభవం నుంచి వస్తాయి. అయితే చాలా అనుభవాలు మనకు తెలివితేటలు లేకపోవటం వలన కలుగుతాయి.
పువ్వులాంటి జీవితాన్ని ముల్లుగా ఎందుకు చూస్తున్నాం
అక్కర్లేని విషయాల్లోనే ఎందుకు చక్కర్లు కొడుతున్నాం
భారం, భయం, బోర్, బేజారు... వీటిని తప్పించుకోలేమా
టేకిటీజీ - అనే పదం అంత కష్టమా
చిన్నతనంలో అందరికీ జీవితం తెెలిగ్గా కనబడుతుంది. అందంగా ఉంటుంది. సీతాకోకచిలుక కనిపించినా, ఇష్టమైన చిరుతిండి తిన్నా, ఆరుబయట ఆడుకున్నా బోలెడు ఆనందం కలుగుతుంది. నవ్వుతున్నవాళ్లంతా మంచి వాళ్లలా, కోపంగా ఉన్నవారంతా చెడ్డ వ్యక్తులుగా కనబడుతుంటారు. కానీ రానురాను పెద్దయిన కొద్దీ ఆనందాలు మాయమవుతుంటాయి. ప్రపంచంలో ఉన్న చెడు అనుభవంలోకి వస్తుంది. ఇతరులు ఎలా ఆలోచిస్తున్నారో అలాగే ఆలోచించడం మొదలుపెడతాం. జీవితంలో అవమానాలు, కష్టాలు, అపజయాలు తెలుస్తుంటాయి. మనసుకి నొప్పి కలుగుతుంది. ఇంకెప్పుడూ అలాంటి నొప్పి లేకుండా బతకాలనిపిస్తుంది. ఇక అక్కడితో మనం మనలాగా కాకుండా ఇంకోలా ప్రవర్తించడం అలవాటు చేసుకుంటాం. ఇవన్నీ భారంగా కనిపిస్తాయి.
మనం బాధపడకుండా ఉండాలంటే, విజయాలు సాధించాలంటే ఇతరులకంటే ముందుండాలంటే ఏంచేయాలో ఆలోచిస్తాం. ఇక అప్పటినుండి ఈర్ష్య, అసూయలు, భయాలు, మైండ్‌గేమ్‌లు అన్నీ మొదలవుతాయి. వీటిమధ్య జీవితం మరింత క్లిష్టంగా మారిపోతుంది.
న లైట్‌తీస్కో అంటున్న యువతరం!
ఈ మధ్యకాలంలో యువతరం, పిల్లల నోటివెంట ఒకమాట ఎక్కువగా వినబడుతోంది. అది లైట్‌తీస్కో- ఒ క రకంగా ఇది మంచి మార్పే. జీవితాన్ని ఇదివరకటికంటే తేలిగ్గా తీసుకోవటం ఈ తరం వారికి అలవాటవుతోంది. అయితే ఇక్కడొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. జీవితంలో అన్ని విషయాలు లైట్‌గా తీసుకునేవి కావు. అలాగే అన్నీ భారంగా భావించాల్సినవీ కావు. పరీక్షలు ఫెయిలయినపుడూ, వ్యాపారంలో నష్టాలు వచ్చినపుడూ, చేయాల్సిన పనులన్నీ పేరుకుపోతున్నపుడూ- లైట్‌తీసుకున్నామంటే ఇక అంతే సంగతులు. జీవితం కూడా మనల్ని లైట్‌గా తీసుకుని మనకంటూ ఎక్కడా గుర్తింపు, గౌరవం లేకుండా చేసేస్తుంది.
న అనవసరమైనవి వదిలించుకోవడమే తెలివి
మన స్థాయిని పెంచి మేలుచేసే విషయాలను చాలా గట్టిగా పట్టుకోవాలి. అలాగే ఎందుకూ పనికిరాకపోయినా కొన్ని విషయాలు మనల్ని జిడ్డులా పట్టుకుని వదలనంటుంటాయి. వీటిని వదిలేస్తుండాలి. అంటే పట్టువిడుపులన్నమాట.
ఒక్కసారి రెండుమూడు తరాల ముందుజీవితాలను పరిశీలిస్తే, అప్పటిరోజుల్లో ఉన్న మాటపట్టింపులు, అలకలు, సంవత్సరాల తరబడి మాట్లాడకుం డా బిగదీసుకుపోవడాలు, అవమానం ఎదురైతే కుమిలిపోవడాలు... ఇప్పుడు అంతగా లేవు. మనం గమనిస్తే ఇరవైఏళ్ల క్రితం వరకు మన సినిమాల్లో సంవత్సరాల తరబడి మాట పట్టింపులతో విడిపోయి బతికే భార్యాభర్తలు, సే ్నహితులు, అన్నదమ్ముల పాత్రలు కనిపిస్తుండేవి. ఇప్పుడు జీవితాన్ని అంత సీరియస్‌గా తీసుకుని బాధల్ని మూటలు కట్టుకుని ముం దురోజులకు తీసుకుని పోదామని ఎవరూ అనుకోవటం లేదు. ఇదంతా మంచి పరిణామమే. మనకీ అవతలివారికి కూడా ఏమాత్రం మేలుచేయని అంశాలను పట్టుకుని వేళ్లాడేబదులు వాటిని టేకిటీజీ...అనివదిలేయడమే మేలు.
న క్రమశిక్షణకు హాస్యం అడ్డుకాదు
మనం చాలాసార్లు చాలా తప్పుడు అభిప్రాయాలతో ఉంటాం. తల్లి ఎప్పుడూ పిల్లలకు ఏమీ తెలియదని, తాను వాళ్లని చక్కదిద్దుతున్నాననే అభిప్రాయంతో ఉంటుంది. అలాగే ఉపాధ్యాయులు టీచర్లు, ఇరుగుపొరుగు, కొలీగ్స్, బంధువులు...ఇలా ఒకచోట కలిసి పనిచేస్తున్నపుడు మనం అవ తలి వారిపట్ల ఒక అభిప్రాయంతో ఉంటాం . అందుకే అవ తలి వ్యక్తుల మాటలు, పనులు, చలోక్తులు లాంటివి పెద్దగా గమనించము. అన్నిచోట ్ల అందరూ స్వేచ్ఛగా ఉండవచ్చు- అనే అభి ప్రాయం బలంగా ఉన్నపుడు మాత్రమే మనం ఇతరుల మాటలకు విలువనివ్వగలం. వారితో కాస్త హాస్యాన్ని జోడించి మాట్లాడగలం. వారు వేసే జోకులకు మనస్ఫూర్తిగా నవ్వగలం. అలాంటి వాతావరణం తేలిగ్గా ఉంటుంది.
కొంతమంది ఎక్కువగా నవ్వడాన్ని ఒక నేరంగా పరిగణిస్తారు. క్రమశిక్షణ, హద్దులు వీరికి బాగా నచ్చిన పదాలు.
జీవితంలో మనం ఏర్పరచుకున్న ఏ నియమమైనా మనకు ఆనందాన్ని విశాలత్వాన్ని ఇవ్వాలి. అలాకాకుండా నేను చాలా ఉన్నతంగా, క్రమశిక్షణతో బతుకుతున్నాను- అనే భావనతో ముడుచుకుపోయి సీరియస్‌గా ఉండటం వలన జీవితం దానికున్న సహజమాధుర్యాన్ని కోల్పోతుంది. చరిత్రలో మనకు తెలిసిన చాలామంది పెద్దవాళ్లు హాస్యాన్ని ప్రేమించారు. ఇతరులపట్ల చాలా ఆదరంగా ఉన్నారు. తాము సాధించాల్సిన కార్యాలకోసం మాత్రం సీరియస్‌గా పనులు చేశారు.
నపనిలో పట్టుదల...ఫలితం టేకిటీజీ!
టేకిటీజీ పాలసీకి వ్యతిరేక పదం చెప్పాలంటే పర్‌ఫెక్షనిజం. తీసినగ్లాసు తీసినచోట, పెట్టిన వస్తువు పెట్టిన చోట ఉంచడంతో మొదలైన పర్‌ఫెక్షనిజం పెద్దపెద్ద విషయాల వరకు వెళ్లిపోతుంది. ఇదంతా క్రమశిక్షణలో భాగంగా చిన్నతనంలో నేర్చుకుంటాం. ఇది ఇలాగే ఉండాలి- అనటంలో ఒక సీరియస్‌నెస్ ఉంది. అయితే ఇక్కడ క్రమశిక్షణని తక్కువ చేసి మాట్లాడటం కాదు. జీవితాన్ని సౌకర్యంగా మార్చుకోవడానికి మనం పద్ధతులు ఏర్పాటు చేసుకున్నాం. ఃఈ విధానాలు మనకోసంః అనుకున్నంతసేపు బాగుంటుంది...మరి కాస్త ముందుకువెళ్లి ఈ గొప్ప పద్ధతులు పాటించడానికే మనం పుట్టాము- అనుకుంటేనే వస్తుంది సమస్యంతా.
కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నదానికి వ్యతిరేకంగా జరిగినా తట్టుకునే ఓర్పు, సహనం ఉండాలి. సందర్భానికి అనుగుణంగా మనల్ని మనం సవరించుకునే శక్తి ఉండాలి. ఇదే ఫ్లెక్సిబిలిటీ. అయితే ఎక్కడ ఎంతవరకు పట్టుదలగా ఉండాలి, ఎక్కడ సడలించవచ్చు...లాంటి విషయాలు మన విచక్షణమీద ఆధారపడి ఉంటాయి.
ఇంకా చెప్పాలంటే పనిచేసేటప్పుడు గట్టిపట్టుదలతోనే చేయాలి. కానీ ఫలితం విషయంలో టేకిటీజీ పాలసీతో ఉండాలి. ముఖ్యంగా ఏం చేసినా మారని విషయాల్లో, అనుకోకుండా ఫలితం తారుమారు అయినపుడు, ఇతరులు మనవల్ల బాధపడతారు అనుకున్నపుడు, ఒక విషయం ఎక్కువ సమయం మనల్ని బాధకి గురిచేస్తున్నపుడు టేకిటీజీయే శ్రీరామరక్ష.
నఈజీగా గాయపడతాము...
ఎవరే చిన్నమాటన్నా కొంపలు మునిగిపోయినంత బాధకలుగుతుంది. ఈజీగా తీసుకునే అలవాటు ఉండదు కాబట్టి ఏ విషయాన్నీ అలా తీసుకోలేము. ఎవరు ఏమన్నా తట్టుకోలేకపోవటం అం టే అది అన్ని వేళలా ఆత్మాభిమానం అవ్వదు. ఒక గాజు మేడని లోపల నిర్మించుకుని ఎవరు రాయేస్తారోననే దిగులుతో గడపటం. అదే మన లోపల ఒక కంచుకోట ఉంటే...
న గతంలో చేసిన తప్పులనుంచి బయటపడలేము
పొరబాట్లు తప్పులు చేయకుండా జీవితాలే ఉండవు. వాటినుండి పాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్లాలి. పొరబాట్లని తేలిగ్గా తీసుకోలేకపోతే అది ఆ పొరబాటుని మించినది అవుతుంది. ఎందుకంటే గతాన్ని తీసేయలేకపోవటం అంటే భవిష్యత్తుని వదిలేసుకోవటం. ముందున్న గమ్యాన్ని చేరడానికి వెనక్కి నడిచినట్టుగా ఉంటుంది. ఇతరులు చేసిన పొరబాట్లను కూడా ఇలాగే చూడాలి. త్రాసు పట్టుకుని ఇతరులు చేసిన తప్పుల్ని, మన పొరబాట్లని కొలతలు వేసుకుని తీర్పులు ఇవ్వడానికి మనం పైనుంచి దిగివచ్చిన న్యాయమూర్తులం కాదు. జరిగిపోయిన విషయాల్లోంచి ఒక కొత్త విషయాన్ని నేర్చకోవటం తప్ప మరే ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోవాలి.
నఇతరులనుంచి ఎక్కువ గౌరవం, కృతజ్ఞత ఆశిస్తాము
మనం చాలా గొప్పవ్యక్తులమనీ, అందరూ మనల్ని గౌరవించాలనే మిథ్యాభావన ఒకటి ఉంటుంది. అలాంటి గౌరవం దక్కకపోతే తట్టుకోలేము. ఏదో పోగొట్టుకున్నట్టు బాధపడిపోతాం. గౌరవం, కృతజ్ఞత బయటనుంచి మనకు వచ్చేవి కావు. ఇవి మనలోపలే ఉంటాయి. ఃనీ ప్రమేయం లేకుండా ఎవరూ నిన్ను అవమానించలేరుః అంటారు మహాత్మా గాంధి. గౌరవం అంటే మనపట్ల మనకున్న విశ్వాసం. కృతజ్ఞత అంటే జీవితంలో మనకు లభించిన ఎన్నో మంచి విషయాలను గుర్తించి, వాటిని కలిగి వున్నందుకు ఆనందంగా, సంతృప్తిగా ఉండటం. ఇతరులు మనతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది వారి సొంత విషయం. దానికి, మన ఆనందానికి ముడిపెట్టి చూడడం హాస్యాస్పదం.
నమన లక్ష్యాలను నిర్లక్ష్యం చేస్తాము
జీవితంలో లక్ష్యాన్ని మాత్రమే చూడాలంటే అనసరమైన విషయాలను నిర్లక్ష్యం చేయాలి. పరిస్థితులు, మనుషులు ఎలా ఉన్నా లక్ష్యం మాత్రమే కనిపించాలంటే మిగిలిన అన్నింటినీ టేకిటీజి అని వదిలేయాలి.
నవ్వటం, హాస్యంగా మాట్లాడటం, త్వరగా గాయపడకుండా ఉండటం, ఇతరులతో మృదువుగా మాట్లాడటం, మార్పుని అంగీకరిస్తూ ముందుకు సాగటం, ఇతరుల వల్ల హాని, అవమానం కలుగుతుందనే భయం లేకుండా ఉండటం....ఇవన్నీ జీవితాన్ని భారంగా కాకుండా ప్రియంగా చూడగల సామర్ధ్యాలు. వీటిని సాధనతోనన్నా సమకూర్చుకోవాల్సిందే.
-వడ్లమూడి దుర్గాంబ