సినిమా రంగుల ప్రపంచంలో వెలుగునీడలు
పక్కపక్కనే ఉంటాయి. సినిమాను నమ్మకుని చిత్రసీమకు చేరుకున్న చాలామందిలో
కొందరు అందలమెక్కితే మరికొందరు ఎదుగుబొదుగులేని జీవితం గడుపుతున్నారు.
కళ్ళముందే వచ్చిన వాళ్ళు ఎదుగుతుంటే తమ దురదృష్టానికి చింతిస్తూ
కుమిలిపోతున్నవారెందరో కనిపిస్తారు. ఉదయం నుండి ప్యాకప్ చెప్పేవరకు
యూనిట్ అందరికీ తిండి తిప్పలు చూసే ప్రొడక్షన్ అసిస్టెంట్‌ల జీవితాన్ని
పరిశీలిస్తే కష్టాలే కనిపిస్తాయి. వందలాది మంది ప్రొడక్షన్ అసిస్టెంట్‌ల
జీవితాలు ఇంతే. ''నెలలో పనిదొరికేది కేవలం వారం పది రోజులే, మిగతా రోజుల్లో
పస్తులు ఉండాల్సిందే. రోజు భత్యంగా కేవలం 500 మాత్రమే ముడుతాయి''
అంటున్నారు ప్రొడక్షన్ అసిస్టెంట్స్ పొంబల రాజు, చంటి (రాజు).
''మా పని సూర్యుడు ఇంకా రాకముందే అంటే నాలుగు గంటలకే మొదలవుతుంది. ప్రొడక్షన్ మేనేజర్ చెప్పిన ప్రొగ్రామ్ ప్రకారం నడుచుకుంటాం. నాలుగు గంటలకే అడ్డాకు చేరుకుని, అక్కడికి మేనేజర్ పంపిన వ్యాన్‌లో మెస్‌కు చేరుకుంటాం. ముందురోజు రాత్రి ఆర్డర్ చేసిన టిఫిన్లు వ్యాన్‌లోకి ఎక్కించుకుని ఉదయం ఆరు గంటలకల్లా లొకేషన్ చేరుకుంటాం. లొకేషన్‌లోనే టీ తయారు చేసి, యూనిట్ అందరికీ సప్లయ్ చేస్తాం. ఆ తర్వాత టీఫిన్లు సిద్ధం చేస్తాం. హీరో హీరోయిన్, దర్శకుడు, నిర్మాత, ఇతర ప్రధాన టెక్నీషియన్స్‌కు ఎవరికివారికే ప్రత్యేకంగా క్యారేజ్‌లు కట్టి ఉంచుతాం. వాటిని వారి గదికి చేర్చాలి. మిగతావారికి స్వయంగా వడ్డిస్తాం. టిఫిన్స్ పూర్తికాగానే మళ్ళీ మెస్‌కు చేరుకుని మధ్యాహ్న భోజనాల ఏర్పాట్లు, ఆ తర్వాత డిన్నర్‌కు కావాల్సినవి ఏర్పాట్లుచేసుకోవాలి. సినిమాకు సంబంధించి మొట్టమొదట వచ్చి, చివర్లో వెళ్ళిపోయేవాడు ప్రొడక్షన్ అసిస్టెంట్'' అని రాజు చెప్పారు.'' ''మాది అనంతరపురం జిల్లా సింగనమల మండలం, అలంకరాయనిపేట గ్రామం. పనికోసం వెతుక్కుంటూ 28 సంవత్సరాల క్రితం చెన్నై వెళ్ళాను. కొన్నాళ్ళు విజయకృష్ణ ఆఫీసులో బాయ్‌గా చేశాను. సీనియర్ నటుడు నరేష్‌కు అసిస్టెంట్‌గా కొద్దికాలం చేశాక. 'అలజడి' సినిమా నుండి ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా మారాను. అక్కడ (చెన్నై), ఇక్కడ (హైదరాబాద్) యూనియన్లలో మెంబర్ షిప్ ఉంది. అప్పట్లో 3,500లకు సభ్యత్వం ఇచ్చేవారు. ఇప్పుడైతే రూ.లక్ష డెబ్బైఅయిదు వేలు తీసుకుంటున్నారు. ఇక మాకు పని దొరికే రోజులు తక్కువే. ఈ రంగంలో కూడా పోటీ పెరిగింది. కొందరు మేనేజర్లు తమ బంధువులను పిలిపించి, యూనియన్ సభ్యత్వం ఇప్పించి, పనికల్పిస్తున్నారు. దీనివల్ల మాలాంటి సీనియర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎలాంటి రక్షణ లేని జీవితాలు మావి. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగిదే వైద్య ఖర్చులకోసం యూనియన్ కొంత అప్పు ఇస్తుంది. అయితే ఇదంతా తీర్చాల్సిందే. నా వ్యక్తిగత విషయానికి వస్తే నాకు ఇద్దరు పిల్లలు. పెద్ద అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతోంది. అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. పదిహేనేళ్ళ క్రితం కొందరి సూచనమేరకు హైటెక్ సిటీ ప్రాంతంలో కొంత స్థలం తీసుకున్నాను. అక్కడే రేకులతో ఇళ్ళు నిర్మించుకున్నాను. అందులో కొంతభాగం అద్దెకిచ్చాను. ఆ అద్దె మా కుటుంబాన్ని పోషిస్తోంది. సినిమా అంటే ఉన్న ఇష్టం వల్ల ఇబ్బందులు ఎదురైనా కొనసాగుతున్నాం. నాలాంటి వారు చాలా మంది ఉన్నారు'' అని పొంబల రాజు వివరించారు. ''మాలాంటివారికోసం ప్రభుత్వం కానీ పరిశ్రమ కానీ ఏదైనా చేస్తే బావుంటుంది. పని గ్యారంటీలేని జీవితాలుమావి. అందుకే మా పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివించాలనే ఉద్దేశంతో కష్టపడుతున్నాం'' అని ముక్తాయించారు.
- పృథ్వీ