నేటిట్రెండ్‌కు తగ్గట్టుగా
ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించాలని హీరోలంతా ఉవ్విళ్లూరుతున్నారు. తాము
చేసే సినిమా కథ మొదలుకుని పాత్ర వరకు అన్నింటిలోను వారు జాగరూకతతో
వ్యవహరిస్తున్నారు. పాత్ర డిమాండ్ మేరకు ఎంతైనా కష్టపడి తమ బాడీ
లాంగ్వేజ్‌ను మార్చుకోవడానికి కూడా సంసిద్ధమవుతున్నారు. ఇందుకోసం సన్నబడటమే
కాదు ఒక్కోసారి బరువు పెరగాలన్నా వెనుకాడటం లేదు. అంతేకాదు సిక్స్‌ప్యాక్
అవసరమైతే దానిని కూడా ఆచరణలో పెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే... పాత్ర
తీరుతెన్నులను అనుసరించి అభిమానులను ఆకట్టుకునేందుకు హెయిర్ స్టైల్,
డ్రస్సులు, గాగూల్స్ వరకు అన్నింటా కొత్తదనాన్ని ప్రదర్శించేందుకు హీరోలు
పోటీపడుతున్నారు. కాగా కొందరు పేరున్న హీరోలు చేస్తున్న చిత్రాలను,
పాత్రలను విశ్లేషిస్తే, ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తేటతెల్లమవుతాయి.
ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళితే...!
బాలకృష్ణ: ఆ మధ్య 'శ్రీరామరాజ్యం'లో శ్రీరాముడిగా పౌరాణిక పాత్రలోను, ఆ తర్వాత 'అధినాయకుడు'లో మాస్ పాత్రలోను కనిపించిన బాలకృష్ణ ఈ మధ్యనే 'ఊకొడతారా... ఉలిక్కిపడతారా'లో జమీందార్ గెటప్‌లో కనువిందుచేశారు. ఇప్పుడేమో 'శ్రీమన్నారాయణ'లో పవర్‌పుల్ జర్నలిస్టుగా ఓ వైవిధ్యమైన పాత్రలో కనిపించడం విశేషం. పైపెచ్చు ఈ చిత్రంలో పదేళ్ళ వయసు వెనుకకు వెళ్లినట్లుగా బాలకృష్ణ ఎంతో గ్లామరస్‌గా కనిపించారని విశ్లేషకులు అంటున్నారు. కొన్ని సన్నివేశాలలో డ్రస్సులు మొదలుకుని గాగుల్స్ వరకు ఆయన తనదైన ప్రత్యేకతను కనబరిచారు. అభిమానులు సైతం ఇదే అభిప్రాయాన్ని ఆనందంతో వ్యక్తీకరిస్తుండటం విశేషం. కాగా బాలకృష్ణ చేయబోయే కొత్త చిత్రం గురించి ఏవేవో ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, అదేమిటన్నది ఇంకా ధ్రువీకరణ కాలేదు.
నాగార్జున: 'రాజన్న' లాంటి చారిత్రాత్మక చిత్రం చేసిన అనంతరం నాగార్జున భక్తిరస చిత్రంలో శిరిడిసాయి పాత్రలో కనిపించారు. ఇక వీటికి పూర్తి భిన్నంగా 'లవ్ స్టోరి' చిత్రంలో ఆ కథ, పాత్రకు అనుగుణంగా న్యూ లుక్‌తో ఫ్రెంచ్ గడ్డంతో ఆయన కనిపించబోవడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇదిలావుండగా, ఆయన నటించిన మరో చిత్రం 'డమరుకం' విడుదలకు సన్నద్ధమవుతోంది. ఈ తరహా సోషియో ఫాంటసీ చిత్రం చెయ్యడం తన కెరీర్‌లోనే మొదటిసారని నాగ్ ఆ మధ్య అన్నారు కూడా. ఇక ఈ చిత్రం క్లైమాక్స్ ఎంతో హైలైట్‌గా ఉంటుంది. ఆయా సన్నివేశాల్లో గెటప్ పరంగా కూడా ఆయన కొత్తగా కనిపించబోతున్నారు. నాగార్జున మరో కొత్త కోణంలో కనిపించబోయే 'భాయ్' చిత్రం కూడా త్వరలో సెట్స్‌పైకి రానుందని అంటున్నారు. ఇందులో కూడా మరో కొత్తకోణంలో ఆయన కనిపిస్తారని చెబుతున్నారు. ఇక అక్కినేని నాగేశ్వరరావుతో పాటు నాగార్జున, నాగచైతన్య ముగ్గురు కలసి నటించబోయే చిత్రం కూడా నాగార్జునకు ఇంకో వైవిధ్యభరితమైన చిత్రం అవుతుందని అంటున్నారు.
వెంకటేష్: ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'బాడీగార్డ్' అంచనాలకు చేరువ కాలేకపోయింది. ఈ నేపథ్యంలో వెంకటేష్ ఇప్పుడు ఒకటికి రెండు చిత్రాలలో నటిస్తున్నారు. మహేష్‌బాబుతో కలసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు'లో వారిద్దరూ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. కుటుంబ అనుబంధాలకు సంబంధించిన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కుటుంబ కథా చిత్రాల హీరోగా పేరున్న ఆయనకు ఈ చిత్రంలోని పాత్ర ఎంతో పేరు తెచ్చిపెడుతుందని అంటున్నారు. ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'షాడో' చిత్రంలో అండర్ వరల్డ్ డాన్ పాత్రలో నటిస్తున్నారు. హెయిర్‌స్టైల్ మొదలుకుని డ్రస్సు వరకు అన్నివిధాలా కొత్త గెటప్‌లో కనిపించబోతున్నారు. ఇక వివేకానందుడి పాత్రలో కూడా నటించాలని వెంకటేష్ ఎంతగానో ఉవ్విళ్లూరుతున్నారు. ఈ చిత్రాల తర్వాత వివేకానందుడి చిత్రం మొదలవుతుందని అంటున్నారు. ఈ చిత్రాలు, ఇందులోని పాత్రలు వేటికవే విభిన్నమైనవి కావడం గమనార్హం.
పవన్ కల్యాణ్: 'గబ్బర్‌సింగ్' ఘన విజయం సాధించిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంతవరకు తన కెరీర్‌లో చెయ్యని జర్నలిస్టు పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా ఆయనెంతగానో ఒదిగిపోయారని దర్శకుడు పూరి జగన్నాధ్ అంటున్నారు. దాదాపు 12 ఏళ్ళ క్రితం కెరీర్ మొదటి దశలో వీరిద్దరి కలయికలో 'బద్రి' వచ్చి విజయవంతమైన సంగతి తెలిసిందే. ఇందులో న్యూ లుక్‌తో మరింతగా ప్రేక్షకాభిమానులను ఆయన ఆకట్టుకోనున్నారని పూరి చెబుతున్నారు. ఈ చిత్రం తర్వాత నిర్మాత కొండా కృష్ణంరాజు హిందీ, తెలుగు భాషల్లో నిర్మించే చిత్రంలో పవన్ నటించనున్నారు. దీనిద్వారా ఆయన బాలీవుడ్‌లోకి ప్రవేశిస్తున్నారు.
మహేష్‌బాబు: 'దూకుడు', 'బిజినెస్‌మేన్' వంటి విభిన్నమైన చిత్రాల అనంతరం మహేష్ చేస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు'. ఇది పూర్తిగా ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రం కావడంతో ఇందులో మహేష్ తన హెయిర్‌స్టైల్ మార్చినట్లుగా తెలుస్తోంది. ఇటీవల విడుదల చేసిన స్టిల్స్‌లో ఆ విషయాన్ని గమనించవచ్చు. కొన్ని మాస్ చిత్రాల తర్వాత కుటుంబ చిత్రంగా మహేష్‌కు ఇది ఓ విభిన్నం కానుంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తీస్తున్న చిత్రంలో కూడా మహేష్ నటిస్తున్నారు. దీనికోసం మహేష్ సిక్స్‌ప్యాక్ చేస్తున్నారని వినికిడి.
జూనియర్ ఎన్.టి.ఆర్.: 'దమ్ము' చిత్రం తర్వాత జూనియర్ ఎన్.టి.ఆర్. చేస్తున్న చిత్రం 'బాద్‌షా'. మాఫియా నేపథ్య కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్. కొత్తగా కనిపిస్తారని చెబుతున్నారు. అంతేకాదు ఈ చిత్రంలో ఆయన ఫ్రెంచ్ గడ్డంతో కనిపించ బోవడం ఓ విశేషం. ఇంతవరకు ఇటలీ, బ్యాంకాక్ వంటి విదేశాలలో ఈ చిత్రం భారీ షెడ్యూల్‌ను జరుపు కుంది. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరీ జగన్నాథ్, హరీష్‌శంకర్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్. చిత్రాలు చేస్తారని అంటున్నారు.
రామ్‌చరణ్: 'రచ్చ' తర్వాత రామ్‌చరణ్ ఇప్పుడు ఒకటికి మూడు చిత్రాలు చేస్తుండటం విశేషం. పేరున్న యువ కథానాయకులకు ఇది ఎంతో స్ఫూర్తిదాయకమవుతోందని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో 'నాయక్' చిత్రంలోను, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు'లోను రామ్‌చరణ్ నటిస్తున్నారు. అలాగే హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న 'జంజీర్'లో కూడా ఆయన నటిస్తున్నారు. ఈ మూడు చిత్రాల్లోను పొంతన లేకుండా అటు పాత్రో చితంగాను, ఇటు లుక్ పరంగాను విభిన్నంగా కనిపించేందుకు ఆయన జాగ్రత్తలు తీసుకున్నారట.
ప్రభాస్: యంగ్ రెబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్‌కు మాస్ చిత్రాలు, పాత్రలు పెట్టిందిపేరు. అయితే ఆ ఇమేజ్‌కు భిన్నంగా ఆయన నటించిన చిత్రాలు 'డార్లింగ్', 'మిస్టర్ పర్‌ఫెక్ట్' చిత్రాలు వరుసగా విజయవంతం కావడంతో నటుడిగా ప్రభాస్ ఎంతో పరిణతి సాధించాడని కృష్ణంరాజు కూడా ఎంతో మెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ తన ఇమేజ్‌కు అనుగుణమైన మాస్ పాత్రలో 'రెబల్' చిత్రం ద్వారా కనువిందు చేయబోతున్నారని ఆ చిత్ర దర్శకుడు రాఘవ లారెన్స్ అన్నారు. ప్రభాస్ కెరీర్‌లోనే ఇంతకుముందెన్నడూ జరగనంత జాప్యం ఈ చిత్ర నిర్మాణంలో చోటుచేసుకుంది. ఈ చిత్రం పూర్తయ్యేందుకు ఒకటిన్నర సంవత్సరానికి పైగా పట్టింది. క్వాలిటీ కోసమే అంత సమయం తీసుకున్నామని లారెన్స్ అన్నారు. ఇందులోని పాత్రలో ప్రభాస్ లుక్ పరంగా కూడా చాలా కొత్తగా కనిపించనున్నారు. విడుదలైన కొన్ని స్టిల్స్‌లో డ్రస్సుల్లోను, గాగుల్స్‌లోను ఆయన కొత్తగా కనిపిస్తున్నారు. ఇక ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం 'వారధి' కూడా ఆయనకు విభిన్నమవుతుంది. ఇందులో మరో కోణంలో ఆయన కనిపించనున్నారు. వీటి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ ఓ చిత్రం చేస్తారని అంటున్నారు.
శ్రీకాంత్: ఫ్యామిలీ చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ మరోవైపు మాస్ చిత్రాలలో కూడా నటిస్తున్న విషయం తెలియంది కాదు. ఆ మధ్య 'శ్రీరామరాజ్యం'లో లక్ష్మణుడిగా పౌరాణిక పాత్రలో సైతం పేరుపొందిన ఆయన ఇప్పుడు 'దేవరాయ'లో శ్రీకృష్ణ దేవరాయలు పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో దొరబాబు అనే మరో మాస్ పాత్రను కూడా చేస్తున్నారు. తాను శ్రీకృష్ణదేవరాయలు పాత్ర చేసేందుకు 'శ్రీరామరాజ్యం'లోని పాత్ర ఎంతో ప్రేరణను ఇచ్చిందని శ్రీకాంత్ అన్నారు. ప్రస్తుతం వెంకటేష్ 'షాడో'లో ఆయన ఓ కీలక పాత్రను చేస్తున్నారు. అలాగే 'శత్రువు' అనే మరో చిత్రంలో మాస్ పాత్రలో నటిస్తున్న ఆయన ఇవన్నీ తనకు విభిన్నమైనవని అంటున్నారు. కాగా ఈ హీరోల చిత్రాలు కొన్ని త్వరలోను, మరికొన్ని విజయదశమి, దీపావళి, ఇంకా ఈ ఏడాది ఆఖరులోను, వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నద్ధ మవుతున్నాయి. ఈ పోటీలో ఎవరు విజేతలవుతారన్న అంశం ప్రేక్షక న్యాయస్థానంలోనే తేలుతుంది.
- శ్రీరామ్